హీరోయిన్ రెజీనా కస్సాండ్రా అంటే తెలియని వారు ఉండరు.. ఈమె తెలుగు, తమిళ,హిందీ,మలయాళ, కన్నడ భాషల్లో నటిగా రాణించింది.ఒకప్పుడు స్టార్ నటిగా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అవకాశాలు లేక స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రల్లో నటించడానికి కూడా సిద్ధమవుతోంది. ఇక రీసెంట్ గా ఉత్సవం మూవీతో మన ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే విడాముయర్చి అనే తమిళ సినిమా ద్వారా మన ముందుకు రాబోతోంది.అజిత్ హీరో గా నటించిన ఈ సినిమాలో రెజీనా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సినిమాలో రెజీనా పాత్ర ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా చేయని విధంగా ఉంటుందని ఈ సినిమాలో ఆమె చాలా బోల్డ్ గా నటించబోతుందని తెలుస్తోంది. పైకి పద్ధతిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ తనకి సంబంధించిన ఏ విషయాలైనా సరే చాలా ఓపెన్ గా చెప్పేస్తుంది. అలా ఇప్పటికే తన ఎఫైర్ వార్తలను కూడా బయట పెట్టేసింది.
గతంలో చాలామందితో డేటింగ్ చేశానని, కానీ ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.ఇక చాలామంది హీరోయిన్లు తమ హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా తాజాగా రెజీనా కసాండ్రా కూడా తన అభిమానులతో ఇంస్టాగ్రామ్ లో చిట్ చాట్ చేసింది. ఈ చిట్ చాట్ లో భాగంగా ఎంతో మంది అభిమానులు ఆమెను ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అడిగి తెలుసుకున్నారు.ఇక అభిమానులు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి సరదాగా సమాధానం ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కి ఒక అభిమాని కాస్త వింత క్వశ్చన్ అడిగారు.
అదేంటంటే.. మీరు ఎప్పుడైనా చేయకూడని పని చేసి ఇంట్లో పేరెంట్స్ కి దొరికిపోయారా అని ఓ అభిమాని ప్రశ్నించగా..అవును నేను ఓసారి చేయకూడని పని చేసి మా అమ్మకి దొరికి పోయాను. ఒకరోజు మా ఇంటి పక్కన ఇంట్లో గొడవ జరుగుతుంది. దాంతో వారు ఇంట్లో ఎందుకు గొడవ పడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలనే ఆత్రుతలో ఎవరు చూడట్లేదు కదా అని పక్కింట్లోకి తొంగి చూశాను. అయితే నేను చేసిన పని మా అమ్మ చూసి నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.ఇరుగుపొరుగు ఇండ్లలో ఉండే విషయాలు తెలుసుకోవడం మంచి పద్ధతి కాదు ఇంకోసారి అలాంటి పని చేయకు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అంటూ రెజినా అభిమాని అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చింది