మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత చరణ్ తన తండ్రి అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను సొంతం చేసుకుంది. తాజాగా చరణ్ "గేమ్ చేంజర్" అనే సినిమాలో హీరోగా నటించాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు.
ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ఎస్ జె సూర్య ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఈ మూవీ ని డిసెంబర్ 20 వ తేదీన కాకుండా వచ్చే సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
ఇకపోతే ఒక వేళ ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసినట్లయితే ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లోనే భారీగా ఇతర సినిమాలతో పోటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా సినిమాలు ఆ సమయంలో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. దాని ద్వారా ఈ మూవీ కి ఇండియా వ్యాప్తంగా అనేక సినిమాల ద్వారా పోటీ ఉండే అవకాశం ఉంటుంది. అలా జరిగితే గేమ్ చేంజర్ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన కూడా కలెక్షన్లు కాస్త తగ్గే అవకాశం ఉంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.