ఆ విషయంలో విజయ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా రజనీ.. కమల్..!

MADDIBOINA AJAY KUMAR
కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో సూపర్ స్టార్ రజనీ కాంత్ , లోక నాయకుడు కమల్ హాసన్ , తలపతి విజయ్ ముందు వరుసలో ఉంటారు. వీరు ముగ్గురు కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయిలో క్రేజ్ కలిగిన హీరోలుగా కెరీర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే కొంత కాలం క్రితం కమల్ హాసన్ , శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇకపోతే తలపతి విజయ్ కొంత కాలం క్రితం వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (ది గోట్) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున కలెక్షన్లు రాలేదు కానీ తమిళ నాడు ఏరియాలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి. ఇకపోతే సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా వెట్టాయన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ నిన్న అనగా అక్టోబర్ 10 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూడు మూవీలకు కూడా బుక్ మై షో ఆప్ లో ఫ్రీ సేల్స్ లో భాగంగా ఈ సినిమాల విడుదలకి రెండు రోజులకు ముందు వరకు అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది.

కాకపోతే ఈ మూడు సినిమాలలో కూడా ది గోట్ సినిమాకు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి వచ్చింది. ఫ్రీ సేల్స్ విషయంలో బుక్ మై షో లో విడుదలకు రెండు రోజుల ముందు ది గోట్ సినిమాకు 565 కే ప్లస్ ప్రీ సేల్స్ జరగగా , వెట్టాయన్ మూవీ కి 298 కే ప్లస్ ప్రీ సేల్స్ జరిగాయి. ఇక ఇండియన్ 2 మూవీ కి కేవలం 87 కే ప్లస్ ప్రీ సేల్స్ మాత్రమే విడుదలకు రెండు రోజుల ముందు వరకు జరిగాయి. ఇక ఈ ముగ్గురిలో కూడా తలపతి విజయ్ హీరోగా రూపొందిన ది గోట్ సినిమాకు బుక్ మై షో ఆప్ లో ఫ్రీ సేల్స్ భాగంగా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: