మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర” ఈ సినిమాను టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించాడు.. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించారు..ఈ మూవీ సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదల అయిన మొదటి రోజు మిక్స్డ్ టాక్ తో రన్ అయిన దేవర మూవీ ఆ తర్వాత రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.ఈ సినిమాలో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఇచ్చిన బిజిఎం ఫ్యాన్స్ కి ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 500 కోట్ల భారీ కలెక్షన్స్ సాధించి హౌస్ ఫుల్ షోస్ తో దూసుకుపోతుంది.. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు.
ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న విషయం మనకి తెలిసిందే. 2025 జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి ఒక కండిషన్ పెట్టాడని సమాచారం. తన సినిమా కోసం ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ బరువు పెరగాలని సూచించారట... దీని కోసం ఎన్టీఆర్ ప్రత్యేక డైట్ ను ఫాలో అవ్వనున్నాడు.లావు అయితే ఫ్యాన్స్ రిసీవ్ చేసుకుంటారా లేదా అని ఎన్టీఆర్ టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది.అలాగే స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది..