6 ఏళ్ల అరవింద సమేత .. హైలెట్స్ ఇవే..!
అజ్ఞాతవాసి సినిమాను తెరకెక్కించిన త్రివిక్రమ్ భారీ డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ తో హారికా అండ్ హాసిని బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించి రూ .93.5 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది..ఈ సినిమా కేవలం 7 నెలలలోనే పూర్తి చేశారట.
జూనియర్ ఎన్టీఆర్ ఇందులో సరికొత్తగా కనిపించడమే కాకుండా డైలాగులతోనే సినిమా మొత్తం నడిపించేశారు. ముఖ్యంగా శరవేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాగా ఎన్టీఆర్ కెరియర్ లోనే అరవింద సమేత నిలిచింది.
జూనియర్ ఎన్టీఆర్ తండ్రిగా మొట్టమొదటిసారి నాగబాబు ఇందులో కనిపించారు.
జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించిన ఒక నెలన్నర తర్వాత ఈ సినిమా విడుదల అయింది.. ఇందులో కూడా ఎన్టీఆర్ తండ్రి పాత్ర మరణిస్తుంది.
అయితే అరవింద సమేత ఇంట్రడక్షన్ ఫైట్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇందులోని ఫైట్స్ బోయపాటి శ్రీను గుర్తుచేసేలా తీశారు త్రివిక్రమ్.
అరవింద సమేతతో థమన్ పూర్వవైభవం అందుకున్నారు. ఈ సినిమా కోసం సీమ సింగర్ రైటర్ పెంచల్ దాస్ పనిచేశారట.
ఎన్టీఆర్ అరవింద సమేత కోసం తన బాడీ లాంగ్వేజ్ ని పూర్తిగా మార్చేశారు. ట్రైలర్ తోనే యూట్యూబ్లో ఒక సునామి సృష్టించింది అరవింద సమేత.
అరవింద సమేత ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఇక ఈ సినిమా థిఎట్రికల్ రైట్స్, ఓవర్సీస్ ,ఫ్రీ రిలీజ్ డిస్ట్రిబ్యూషన్ అన్ని కలుపుకొని రూ .140 కోట్ల వరకు రాబట్టి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
జగపతిబాబు విలన్ గా హీరోయిన్స్ గా పూజా హెగ్డే, ఈషా రెబ్బ అద్భుతంగా నటించారు. నవీన్ చంద్ర కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అరవింద సమేత లోని కొన్ని సన్నివేశాలు రియల్ లైఫ్ సంఘటనలతో తెరకెక్కించారట.