ఆ హీరోయిన్ మీద కోపంతో సౌంద‌ర్య చేసిన చెత్త ప‌ని ఇదే...!

RAMAKRISHNA S.S.
కొత్త ఒక‌ వింత పాత ఒక‌ రోత అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇది అన్ని విషయాలలోనూ వర్తిస్తుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల గురించి చెప్పటానికి ఈ మాట బాగా సరిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త నీరు రావాలి.. పాత నీరు పోవాలి.. అన్న సామెత ఉంది. అయితే ఇక్కడ హీరోల కంటే హీరోయిన్లకు కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. ఒక హీరోయిన్ పది సంవత్సరాలు ఈ రంగంలో కొనసాగింది అంటే చాలా గొప్ప అని చెప్పుకోవాలి. ఎంతో పెద్ద స్టార్ హీరోయిన్ అయితే త‌ప్పా ప‌ది సంవ‌త్స‌రాల కెరీర్ ఉండ‌దు.

హీరోలు మాత్రం ఏళ్ల తరబడి సినిమాలు చేస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్‌లో ఒకప్పుడు సౌందర్య అంటే తిరుగులేని క్రేజ్ ఉండేది. సౌందర్య సినిమాలు వస్తున్నాయి అంటే హీరోలతో సంబంధం లేకుండా మహిళా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టి.. ఆ సినిమాలను సూపర్ డూపర్ హిట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పట్లో నాగార్జున, విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోలు వరుస‌పెట్టి సౌందర్యతో సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టారు.

అయితే సౌందర్య మంచి ఫామ్‌లో ఉండగా రంభ బాగా అందాలు ఆరబోస్తూ.. సౌందర్యకు వెళ్లాల్సిన కొన్ని ఛాన్సులు కొట్టేసిందట. ఇక్కడే సౌందర్యకు కోపం వచ్చిందని అంటారు. రంభ‌ రెచ్చిపోతూ తన అవకాశాలు దక్కించుకుంటడంతో సౌందర్య కూడా రెచ్చిపోయి నాభి అందాలతో పాటు.. అప్పుడప్పుడు కాస్త ఓవర్గా ఎక్స్పోజింగ్ చేసేదన్న చర్చ అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో బాగా వినిపించింది. ఒకానొక దశలో రంభ ఏ యే సినిమాలు చేస్తుంది. ఏ స్టార్ హీరోల సినిమాలు ఆమెకు వెళుతున్నాయని.. సౌందర్య ఇండస్ట్రీలో తన వేగుల ద్వారా ఎంక్వైరీ కూడా చేసేదన్న గుసగుసలు ఉన్నాయి. ఆ తర్వాత సౌందర్య హెలిక్యాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: