మహేష్ బాబు చెల్లి ఇప్పుడు ఎలా ఉంది .. బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
అలాగే మోహన్ బాబు హీరోగా వచ్చిన యమజాతకుడు సినిమాలో ఆయన మేనకోడలుగా నటించన.. ఈమె వెంకటేష్ ప్రేమించుకుందాం రా సినిమాలోను కీలకపాత్రలో మెరిసింది. అయితే ఒక్కడు సినిమా తర్వాత సినిమాలకు దూరమైన నిహారిక పలు మూవీలో అవకాశాలు వచ్చినా కూడా తన చదువుపైనే దృష్టి పెట్టంది. అయితే ఈ ముద్దుగుమ్మకు పెళ్లి కూడా అయిపోయిందట.. ఒక పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయితో సుమారు పది సంవత్సరాల క్రితమే ఈమెకు వివాహం జరిగిందట. ఈ పెళ్లి వేడుకకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కూడా హాజరయ్యారట. ఇప్పుడు నిహారికకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అయితే ప్రస్తుతం చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్న నిహారిక.. తన ఫ్యామిలీ లైఫ్ తో ఎంతో హ్యాపీగా గడుపుతుంది. ఇక ఈమె సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా లేరు. అయితే గతంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూకు నిహారిక హాజరయ్యారు. మళ్లీ ఆ తర్వాత ఎక్కడా బయట కనిపించింది లేదు.
అయితే అప్పుడప్పుడు నెట్టింట నిహారిక ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. వీటిని చూసిన నెటిజన్లు హీరోయిన్ లా ఉన్నారంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. అలాగే నటిగా మళ్లీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వొచ్చుగా అంటూ కోరుతున్నారు. మరి నిహారిక మళ్లీ ఇండస్ట్రీలోకి వస్తుందో ? రాదో? రాబోయే రోజుల్లో తెలుస్తోంది.