బాహుబలిలో చూపించినట్లు నిజంగానే తాటి చెట్లు వంగుతాయా.. అసలు నిజం ఏంటంటే?

praveen
రాజమౌళి దర్శకుడిగా తెరకెక్కించిన బాహుబలి సినిమా వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చింది. రెండో భాగం మొదటి భాగం కంటే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించింది. ఎందుకంటే, మొదటి భాగంలో చాలా సస్పెన్స్‌ క్రియేట్ చేశారు కాబట్టి, ప్రేక్షకులు రెండో భాగం చూడాలని ఆసక్తిగా ఎదురు చూశారు. రెండో భాగంలో ఒక భారీ యుద్ధం ఉంటుంది. ఆ యుద్ధంలో మహేంద్ర బాహుబలి అనే వీరుడు భల్లాలదేవుడి కోటను నాశనం చేస్తాడు. ఆ సన్నివేశంలో చాలా తాటి చెట్లు కనిపిస్తాయి.
బాహుబలి సినిమా చూసినప్పుడు, మహేంద్ర బాహుబలి తన చిన్న సైన్యంతో భల్లాలదేవుడి కోట మీద దాడి చేసే సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది. కోట గేటు మూసి ఉన్నందున, వాళ్ళు తాటి చెట్ల సహాయంతో కోట లోపలికి వెళ్లారు. ముగ్గురు నలుగురు సైనికులు కలిసి ఒక తాటి చెట్టుని వంచి, దానిని విడిచి వేసినప్పుడు, అది బాణంలా ఎగిరి కోట గోడ దాటి లోపలికి వెళ్లారు.
సినిమాలో తాటి చెట్లను చాలా సులభంగా వంచుతున్నట్లు చూపించారు. కానీ ఎవ్వరూ ఈ విషయం గురించి ప్రశ్నించలేదు. అసలు తాటి చెట్లను అలా వంచడం సాధ్యమా? సైన్స్ ఏమంటుంది?బాహుబలి సినిమా చూసినప్పుడు, తాటి చెట్లను రబ్బరులా వంచి, వాటిని ఉపయోగించి కోట లోపలికి వెళ్లిన దృశ్యం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ, నిజ జీవితంలో తాటి చెట్లను అంత ఎక్కువగా వంచలేము.
తాటి చెట్లు కొంతవరకు వంగుతాయి కానీ, అవి రబ్బరులా కావు. అవి కేవలం 50 డిగ్రీల కోణం వరకే వంగుతాయి. అంతకంటే ఎక్కువ వంచడానికి ప్రయత్నిస్తే, అవి విరిగిపోతాయి. అంటే, సినిమాలో చూపించినట్లు తాటి చెట్లను ఉపయోగించి కోట లోపలికి వెళ్లడం అసాధ్యం. అది కేవలం సినిమా కోసం చేసిన ఒక స్పెషల్ విజువల్ ఎఫెక్ట్ మాత్రమే. సినిమా అనేది కల్పన. అందులో అద్భుతాలు జరగాలి. అలాంటి అద్భుతాలే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సో, తప్పుబట్టటానికి ఏం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: