RRR కంటే ముందే జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన మల్టీ స్టారర్ సినిమా ఇదే.. జస్ట్ మిస్..బ్రతికిపోయాడు..!

Thota Jaya Madhuri
మారిపోతున్న కాలానికి పెరిగిపోతున్న టెక్నాలజీకి ట్రెండ్ బాగా బాగా ఫాలో అయిపోతున్నారు జనాలు . ఒకప్పుడు డైరెక్టర్స్ తీసిన సినిమాలను జనాలు ఇష్టపడేవారు.  అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు.  జనాలు ఏ విధమైన అటువంటి కంటెంట్ ఇష్టపడితే అటువంటి కంటెంట్ ని అలాంటి జోనర్ లోనే సినిమాని తెరకెక్కించాలి అని డైరెక్టర్ లు భావిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ల ట్రెండ్ ఎక్కువగా చూస్తున్నాము.


ఒకప్పుడు ఒక హీరో నటించిన సినిమాని మరొక హీరో సపోర్ట్ చేయడమే పెద్ద గగనంగా ఉండేది . అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒక హీరోతో కలిసి మరోక హీరోతో నటించడానికి ఇష్టపడుతున్నారు. పాన్ ఇండియా  హీరోలు కూడా కలిసి మల్టీ స్టారర్ సినిమాల్లో నటిస్తున్నారు . ఇప్పుడు ఎక్కువగా అలాంటి కధలనే చూస్ చేసుకుంటున్నారు హీరోస్. ఆర్ ఆర్ ఆర్ సినిమా మల్టీ స్టారర్ మూవీ నే. అయినప్పటికి ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలుసు.


ఏకంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఆస్కార్ తీసుకొచ్చింది. నిజానికి ఎన్టీఆర్ కి ఈ సినిమా కంటే ముందు చాలా సినిమాలలో మల్టీస్టారర్ ఆఫర్ వచ్చిందట . కానీ పలు కారణాల చేత రిజెక్ట్ చేస్తూ వచ్చారట . అందులో ఒకటే "ఊపిరి". నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాలో కార్తీక్ నటించిన పాత్రలో మొదటగా ఎన్టీఆర్ ని అనుకున్నారట . అయితే అంత పెద్ద స్టార్ హీరో అలా మరొకరికి సపోర్టు చేసే క్యారెక్టర్ చేయడం చూస్తే ఫ్యాన్స్ ఎక్కడ బాధపడతారో  అన్న భయంతో తారక్ ఆ సినిమాను రిజెక్ట్ చేశారట . ఒకవేళ సినిమా చేసుంటే నిజంగానే తారక్ కు ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ రియాక్షన్ వచ్చుండేది . రిజెక్ట్ చేసి బ్రతికిపోయాడు . ఆ పాత్రకు కార్తీ సరైన న్యాయం చేశాడు . ఆ సినిమా మంచి హిట్ అందుకుంది..!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: