విశ్వంభర, బింబిసారా రెండు సినిమాలు కు ఉన్న లింక్ ఇదే..!
ఇక ముఖ్యంగా రెండు యుగాలకు మధ్య ఇంటర్ లింక్ పాయింట్‌తో ఈ సినిమా తెరకక్కెంచినట్టుగా మనం ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. యుగానికి మరో యుగానికి మధ్య ట్రావెల్ అనేది ఎలా ఉండబోతుంది. అసలు అన్యాయంతో విర్రవీగుతున్న రాక్షసులను హీరో ఎలా అంతం చేస్తాడు అనే పాయింట్ తో ఈ సినిమా వస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హై వోల్టేజ్ గ్రాఫిక్స్ ఉండడం కూడా ఈ సినిమాకు చాలావరకు ప్లస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా బింబిసర, విశ్వంభరా రెండు ఒకే పాయింట్ తో తెరకెక్కినట్టు కూడా అర్థమవుతుంది.
ఇక ఇప్పుడు చిరంజీవి విశ్వంబర కూడా సినిమా విషయంలో కూడా బింబిసార సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అలాగే ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా నిర్మాతలు క్లారిటీ ఇవ్వటం లేదు. సంక్రాంతికి వస్తుందని అంటుంటే మరికొందరు సమ్మర్ కి పోస్ట్ పోన్ అయింది అని కూడా అంటున్నారు. ఇక మరి విశ్వంబర ఎప్పుడు సందడి చేస్తుందో చూడాలి. ఇక విశ్వంభర సినిమా కూడా చాలా వరకు యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండి పోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనే దాన్నిబట్టే చిరంజీవి పాన్ ఇండియా మార్కెట్ భారీగా పెరుగుతుందా లేదా అనేది కూడా ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు…