రాజమౌళి.. రామ్ చరణ్ : వీరిద్దరి కాంబోకు తిరిగే లేదు.. ఏకంగా ఆ స్థాయి హిట్స్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన కాంబినేషన్లో రాజమౌళి , రామ్ చరణ్ కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో మొదటగా మగధీర అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... ఏం ఏం కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. విజయంద్ర ప్రసాద్ ఈ మూవీ కి కథను అందించగా ... గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా ఆ సమయం వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఈ మూవీ తో ఇటు రాజమౌళి అటు రామ్ చరణ్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఈ మూవీ అనంతరం చాలా సంవత్సరాల తర్వాత వీరి కాంబోలో ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ వచ్చింది. ఈ మూవీ లో చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటించాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ లో రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఈ మూవీ 1200 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. అలాగే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా రావడంతో ఈ మూవీ ద్వారా చరన్ కి దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు లభించింది. రామ్ చరణ్ , రాజమౌళి కాంబో లో రూపొందిన రెండు మూవీలు కూడా అద్భుతమైన విజయాలు సాధించడంతో వీరి కాంబో అంటే తెలుగు సినీ ప్రేమికుల్లో ప్రత్యేక ఈమేజ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: