ఓరి దేవుడోయ్..రష్మికకు ఎంత ధైర్యం..నాగచైతన్యను అంత మాట అనేసింది ఏంటి..?
ఇప్పటికే అటు బుల్లితెర ఇటు వెండి తెర ను ఏలేస్తున్నారు కన్నడ ముద్దుగుమ్మలు. మరీ ముఖ్యంగా రష్మిక మందన్నా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోవడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . ఛలో సినిమా హిట్ అయినప్పటికీ రష్మికకు అవకాశాలు పెద్దగా రాలేదు . కానీ సడన్గా బడాబడా స్టార్ సినిమాలల్లో అవకాశాలు సంపాదించుకున్నింది. అయితే రష్మిక మందన్నా పలువురు స్టార్ హీరో సినిమాలను కూడా రిజెక్ట్ చేసి పడేసింది .
అందులో ఒకడే నాగచైతన్య. నాగచైతన్య కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా "మజిలీ". శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత కంటే ముందే రష్మిక ను అనుకున్నాడట డైరెక్టర్. కానీ నాగచైతన్య పక్కన వాళ్ళనే వీళ్ళని పెట్టడం కన్నా తన భార్య సమంతను పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చాలామంది శివనిర్వాణకు సజెషన్స్ ఇచ్చారట .
అయితే మొదటి నుంచి రష్మికనే ఈ రోల్ కి బాగుంటుంది అనుకున్న డైరెక్టర్ ఆమెని అప్రోచ్ అయ్యి కధ వివరించారట. ఒక్క ముక్కలో నాగచైతన్య తో రష్మిక ఆ సినిమాను రిజెక్ట్ చేసిందట . అప్పటివరకు నాగచైతన్య పెద్దగా హిట్ లను తన ఖాతాలో వేసుకోకపోవడమే అందుకు కారణం అంటూ జనాలు మాట్లాడుకున్నారు . ఒకే ఒక్క మాటతో బడా ఇంటి నుంచి వచ్చిన హీరో అయినా సరే రష్మిక మందిన్నా నాగచైతన్య తో సినిమా క్యాన్సిల్ చేసి ఆయన పరువు మొత్తం తీసేసింది..!!