సంక్రాంతి పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ సందడి వాతావరణం కనబడుతూ ఉంటుంది. ఇకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతి కోసం చాలా కాలం నుండే అనేక సినిమాలు పోటీ పడుతున్న విషయం మనకు తెలిసిందే. ముందుగా చిరంజీవి హీరోగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను కూడా సంక్రాంతి పండుగకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల విడుదల తేదీలు కూడా వచ్చాయి.
ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలు అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి దిల్ రాజు , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ ని నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమాను కూడా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దీనితో ఆయన నిర్మించిన సినిమాల మధ్య దాదాపు 20 రోజుల గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆయన ఈ రెండు సినిమాలను సరిగ్గా విడుదల చేస్తాడు అని అంతా భావించారు.
కానీ అనూహ్యంగా విశ్వంభర మూవీ పోస్ట్ పోన్ కావడంతో ఆ తేదీన గేమ్ చేంజర్ మూవీ ని విడుదల చేయనున్నట్లు దిల్ రాజు ప్రకటించాడు. దీనితో సంక్రాంతి బరిలో నిలిచే రెండు సినిమాలు కూడా దిల్ రాజు వే కావడంతో ఆయన ఇందులో నుండి వెంకీ , అనిల్ రావిపూడి కాంబో మూవీ ని విడుదల నిలిపివేసే అవకాశం ఉన్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి అలాగే నిలిపివేస్తే కనుక వెంకీ ఫాన్స్ డిసప్పాయింట్ అయ్యే అవకాశం కూడా చాలా వరకు ఉంది. మరి దిల్ రాజు ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తాడా అనేది చూడాలి.