క‌థ విన‌కుండానే ఓకే చెప్పిన చిరంజీవి... డిజాస్ట‌ర్ కొట్టిన చ‌ర‌ణ్‌...!

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా సింధూరం, నిన్నే పెళ్ళాడుతా లాంటి సినిమాలు తర్వాత టాలీవుడ్‌లో కృష్ణవంశీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పట్లో చిరంజీవి లాంటి హీరోలు సైతం పిలిచి కృష్ణవంశీతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించారు. అయితే ఆ తర్వాత కృష్ణవంశీ చాలా సినిమాలు చేసిన ఎందుకో కమర్షియల్ డైరెక్టర్గా సక్సెస్ కాలేకపోయారు. ఒకటి, రెండు హిట్ సినిమాలు పడటమే తప్ప.. ఆయన స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే స్థాయికి అంతగా ఎదగలేదు. కృష్ణవంశీ సినిమాలు అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.

కావాల్సిన రొమాన్స్, యాక్షన్, ఎమోషన్స్, కామెడీ పుష్కలంగా ఉంటాయి. ప్రతి ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులు, స్క్రీన్ నిండా సెట్ ప్రాపర్టీస్.. బాగా ఉండాల్సిందే. సినిమా చూస్తున్నంత సేపు పల్లెటూరి వాతావరణంతో పాటు.. చక్కని కుటుంబ వాతావరణం ఉంటుంది. మహేష్ బాబుతో మురారి, ఖడ్గం లాంటి సినిమాల ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. కృష్ణవంశీ.. గోవిందుడు అందరివాడేలే సినిమా తెరకెక్కించారు.

ఈ సినిమా అయింది బండ్ల గణేష్ ఈ సినిమాకు నిర్మాత. సినిమా డిజాస్టర్ అయ్యాక బండ్ల గణేష్ పరోక్షంగా కృష్ణవంశీ పై తన కోపాన్ని వెళ్ళగక్కారు. కృష్ణవంశీకి ఎవరు ఛాన్స్ ఇవ్వని టైంలో చిరంజీవిని కలిసి.. అన్నయ్య ఓ కథ ఉంది కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీ చరణ్‌తో చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పగా.. చిరంజీవి వెళ్లి చరణ్ కు కథ చెప్పమన్నారట. ఆ తర్వాత కృష్ణవంశీ చిరంజీవిని కలిస్తే నువ్వేం చెప్పావో తెలియదు.. వాడేమి విన్నాడో తెలియదు.. సినిమా మాత్రం బాగా రావాలని అన్నారట. అలా గోవిందుడు అందరివాడేలే మొదలైంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. అలా చిరంజీవి కథ వినకుండా కృష్ణవంశీపై నమ్మకంతో హిట్ సినిమా తీయమని చెబితే కృష్ణవంశీ పెద్ద ప్లాప్ సినిమా తీశాడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: