వైరల్ గా మారుతున్న నారా రోహిత్ ఎంగేజ్మెంట్ ఫొటోస్.. పెళ్లి డేట్ ఫిక్స్..!

Divya
టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు.. తాను నటించడం ప్రతినిధి-2 సినిమాలోని హీరోయిన్ సిరి లెల్లాను ప్రేమించి వివాహం చేసుకోబోతున్నారు.. వీరి నిశ్చితార్థం ఈ రోజున హైదరాబాద్లో నోవాటెల్ హోటల్లో చాలా గ్రాండ్గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం 10:45 నిమిషాలకు రోహిత్ ,శిరీష నిశ్చితార్థం గ్రాండ్గా జరిగినట్లుగా తెలుస్తోంది. వీరిరువురి కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ ఏడాది డిసెంబర్ 15న వీరి వివాహం జరగబోతోంది.

సిరిలెల్ల, నారా రోహిత్ ఎంగేజ్మెంట్ వేడుకకు సైతం నారా కుటుంబ సభ్యులకు కూడా హాజరయ్యారు. అలాగే వీరి స్నేహితులు, బంధువులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. నారా ఫ్యామిలీతో పాటు సిరిలెల్ల కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. ప్రతినిధి-2 సినిమాలో నారా రోహిత్ తో కలిసి నటించిన శిరీష రియల్ లైఫ్ లో కూడా పార్టనర్ కాబోతున్నట్లు తెలుస్తోంది ఈ విషయం తెలిసిన అభిమానులు వెంటనే వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.

బాణం సినిమాతో మొదటిసారి తన సినీ కెరీర్ ని ప్రారంభించిన నారా రోహిత్ ప్రతి నిధి సినిమా కథను కూడా సెలెక్ట్ చేసుకుని మరి ఆలోచించి అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. అయితే పెళ్లి విషయంలో కాస్త టైం తీసుకున్నప్పటికీ ఫైనల్ గా బ్యాచిలర్ లైఫ్ ను వీడి దాంపత్య బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఇందులో నారా రోహిత్ జిబ్బా వేసుకొని ఉండగా సిరి పట్టు చీరలో చాలా సింపుల్గా కనిపిస్తోంది. వీరిద్దరికి సంబంధించిన కొన్ని స్టిల్స్ అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి వివాహం తర్వాత నారా రోహిత్ సినిమాల విషయంలో కలిసి వస్తుందో లేదో చూడాలి మరి. ప్రస్తుతం ఈ ఫోటోలు అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: