స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన స‌దా కెరీర్ నాశ‌నం చేసిన స్టార్ డైరెక్ట‌ర్‌.. ఏం జ‌రిగింది...!

RAMAKRISHNA S.S.
సదా అందరికీ తెలిసిన అమ్మాయి. టాలీవుడ్ లో నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో ఆమె హీరోయిన్గా పరిచయం అయింది. చాలా తక్కువ టైంలోనే తెలుగుతోపాటు అటు తమిళంలోనూ.. సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసింది. ఓ సాధారణ ముస్లిం కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన అమ్మాయి.. ఆ స్థాయికి రావటం గొప్ప విషయం. మామూలుగా ముస్లిం కుటుంబాలలో ఎన్నో కట్టుబాట్లు ఉంటాయి. వాళ్లు కనీసం మొఖం చూపించడానికి కూడా ఒప్పుకోరు. వారి ఆచారం అలాంటిది. అయితే సదా ఏకంగా హీరోయిన్ అయిపోయింది.

తనకు అమ్మానాన్నలు సపోర్ట్ పుష్కలంగా ఉండటం వల్ల హీరోయిన్గా నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. జయం సూపర్ హిట్ అయ్యాక తెలుగు ఇండస్ట్రీలో సదా పేరు మార్మోగిపోయింది. అలాంటి సదాకు ఏకంగా శంకర్ లాంటి అగ్ర దర్శకుడు ఛాన్స్ ఇచ్చారు. అంటే ఆమెలో టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాన‌వ‌సరం లేదు. సదా తెలుగులో జయం, జూనియర్ ఎన్టీఆర్ సరసన నాగ, దొంగ దొంగది, అవునన్నా కాదన్నా, చుక్కల్లో చంద్రుడు, బాలకృష్ణ సరసన వీరభద్ర, క్లాస్మేట్స్, టక్కరి, అపరిచితుడు, యమలీల 2 లాంటి సినిమాలలో నటించింది. వీటిలో కొన్ని సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి.

అయితే శంకర్.. విక్రమ్ హీరోగా అపరిచితుడు సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ఏడాదిన్నర పాటు మరే సినిమా చేయకూడదు అని కండిషన్ పెట్టడంతో సదా ఓకే చెప్పింది. అపరిచితుడు తెలుగు, తమిళ భాషలలో సూపర్ హిట్ అయింది. కెరీర్ పరంగా సదా ఫామ్ లో ఉన్నప్పుడు ఏడాదిన్నర పాటు ఈ ఒక్క సినిమాకి డేట్లు ఇవ్వడంతో రేసులో ఆమె వెనకబడిపోయింది. మరో సినిమా చేసేందుకు ఆమెకు ఛాన్స్ లేదు. అప్పట్లో తెలుగులో చాలామంది హీరోలు సదాతో సినిమా చేయాలని ప్రయత్నాలు చేసిన శంకర్ సినిమాతో ఆమె ఇరుక్కుపోయింది. అలా పేరుకు శంకర సినిమాలో నటించిన ఆ సినిమా హిట్ అయిన కూడా సదా కెరీర్ బాగా దెబ్బతిన్ననే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: