తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన
మాస్ ఈమేజ్ కలిగిన హీరోలలో
బాలకృష్ణ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో
మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలలో హీరోగా నటించి ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే
బాలకృష్ణ కొన్ని సందర్భాలలో రొటీన్ అని చెప్పి రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాలలో కొన్ని సినిమాలు
బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం
మాస్ మహారాజా
రవితేజ హీరోగా
శృతి హాసన్ హీరోయిన్గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో
క్రాక్ అనే
మూవీ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ
మూవీ లో
సముద్ర ఖని ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ...
వరలక్ష్మి శరత్ కుమార్ ఈ
మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో గోపీచంద్ మొదట రవితేజను కాకుండా
బాలకృష్ణ ను హీరోగా అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనను కలిసి కథను కూడా వివరించాడట.
కథ మొత్తం విన్న
బాలయ్య ఇప్పటివరకు ఇలాంటి కమర్షియల్ సినిమాలు ఎన్నో చేశాను. మళ్లీ ఇలాంటి కమర్షియల్
సినిమా అంటే వర్కౌట్ అవుతుందో లేదో అని చెప్పి ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత గోపీచంద్ ,
రవితేజ ను సంప్రదించి ఆయనకు ఈ కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. అలా
బాలయ్య రొటీన్ అని రిజెక్ట్ చేసిన
మూవీ తో
రవితేజ కు మంచి విజయం దక్కినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం
బాలయ్య , గోపీచంద్ కాంబోక్లో వీర
సింహా రెడ్డి అనే
మూవీ రూపొందింది. ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.