అక్కినేని నాగార్జున నిజంగానే ప్రియురాలి కారణంగా టార్చర్ అనుభవించాడా..ఇంతకీ నాగార్జున ప్రియురాలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రియురాలి కారణంగా నాగార్జున ఇబ్బందులు ఫేస్ చేశాడు అంటే అందరూ హీరోయిన్ టబు అనుకుంటారు. కానీ ఆమె కాదు నాగార్జున రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్స్ గా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి.అందులో ఒకరు శ్రీయ శరణ్.. సంతోషం, నేనున్నాను, మనం,ఊపిరి,బాస్ వంటి సినిమాల్లో నాగార్జున శ్రీయా శరణ్ ఇద్దరూ కలిసి నటించారు.. వీళ్ళిద్దరూ అన్ని సినిమాల్లో కలిసి నటించడం కారణంగా ఇద్దరి మధ్య ఏదో నడుస్తోంది అనే రూమర్ ఇండస్ట్రీలో అయితే గట్టిగానే వినిపించింది. అయితే నాగార్జున రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ శ్రియా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాడట. ఇక ఈ విషయాన్ని జయప్రద హోస్ట్ గా చేసిన జయప్రదం షోలో స్వయంగా బయటపెట్టారు.
నాగార్జున హీరోయిన్లతో నటించిన సమయంలో ఉన్న అనుభవం గురించి అడిగారు. దానికి నాగర్జున మాట్లాడుతూ నేను హీరోయిన్ శ్రియా కారణంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. షూటింగ్ సమయంలో అందరూ టైం కి వచ్చేస్తే ఆమె మాత్రం టైం కి రాకుండా షూటింగ్లో ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేది. ఆమె వల్ల మేము ఎన్నో సార్లు ఇబ్బందులు పడ్డాం.శ్రియ చాలా లేజీ ఫెల్లో.. ఇక ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె తన ప్రవర్తన మార్చుకోలేదు.చాలాసార్లు షూటింగ్ కి లేటుగా వచ్చి నాతో తిట్లు తిన్నది.
అయినా కూడా శ్రియా ప్రవర్తన మారలేదు. నా సినీ కెరీర్ లో ఆ ఒక్క హీరోయిన్ వల్లే నేను ఇబ్బందులు ఫేస్ చేశాను అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. అలాగే ఏ హీరోయిన్ తో మీరు ఎక్కువగా మాట్లాడతారు అని అడగగా..నాకు రమ్యకృష్ణతో ఎక్కువ అనుబంధం ఉంది. ఆమె ఒక వాగుడుకాయ్..బహుశా మేమిద్దరం కలిసి ఎక్కువ సినిమాల్లో చేయడం వల్లే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి అలా మాటలు కూడా పెరిగిపోయాయి.. అంటూ నాగార్జున ఆ షో లో చెప్పుకొచ్చారు