శ్రీదేవి జీవితంలో ఎన్నో చెడు సంఘటనలు ఉన్నాయి. ఈమె జీవితమే ఒక ముళ్ళబాట లాంటిది.ఈమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.అయినా కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణించింది.ఇండస్ట్రీలో ఎంత స్టార్ అయిందో జీవితంలో అంత ఫ్లాప్ అయిపోయింది. అయితే బోని కపూర్ తో పెళ్లి తర్వాత కూడా శ్రీదేవి జీవితం మీద ఎన్నో రూమర్లు వినిపించాయి.అయితే శ్రీదేవి బోనీ కపూర్ ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పటికీ వీరి కాపురం ఏమీ సజావుగా సాగలేదు. ఎందుకంటే బోనీకపూర్ కి అప్పటికే పెళ్లయి పిల్లలు ఉండడం కారణంగా మొదటి భార్య కారణంగా శ్రీదేవి ఎన్నో అవమానాలు పడింది. ముఖ్యంగా తన కాపురంలో చిచ్చు పెట్టింది అనే ఉద్దేశంతో బోనీకపూర్ మొదటి భార్య శ్రీదేవి పై ఎన్నో శాపనార్థాలు పెట్టింది.
ఇక శ్రీదేవి బోని కపూర్ తో కలిసి ఓ సినిమా ఫంక్షన్ లో ఉండగా అందరి ముందే చెప్పు దెబ్బలు కూడా తిన్నది. ఇక అసలు విషయం ఏమిటంటే..బోని కపూర్ తల్లి శ్రీదేవితో తన కొడుకు ని వదిలేయమని చాలాసార్లు వార్నింగ్ ఇచ్చిందట. కానీ శ్రీదేవి బోని కపూర్ లు అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉండడం కారణంగా ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారట. అయితే పెళ్లి కాకుండానే వీరిద్దరూ సహజీవనం చేస్తున్న సమయంలో ఓ సినిమా ఈవెంట్ కి కలిసి వెళ్లారట.
ఇక అక్కడ అంత మంది సినీ పెద్దలు ఉన్నా కూడా ఆ విషయం పట్టించుకోకుండా బోనీ కపూర్ తల్లి తన కొడుకు జీవితంలో నిప్పులు పోసింది అనే ఉద్దేశంతో శ్రీదేవిని అందరి ముందే అవమానించి తన కాలి చెప్పు తీసుకొని కొట్టిందట. ఇక ఈ అవమానాన్ని భరించలేక శ్రీదేవి కన్నీళ్లు పెట్టుకొని ఆ సినిమా ఫంక్షన్ నుండి ఇంటికి వెళ్లిపోయిందట. అలా శ్రీదేవి తన జీవితంలో ఎన్నో దుర్బర పరిస్థితులను అనుభవించింది