అనారోగ్య సమస్యలతో స్టార్ హీరో.. అందుకే బ్రేక్..!
అయితే తాను ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి గల కారణాలను కూడా తెలుపుతూ.. తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపుగా 13 సంవత్సరాలు అవుతోంది కానీ ఇప్పటికి 43 చిత్రాలలో మాత్రమే నటించాను.. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో తాను ఇక్కడ సక్సెస్ అవ్వగలనా లేనా అనే విషయం పైన సందిగ్ధత ఉండేదని.. అలాగే తనని ప్రేక్షకులు రెండున్నర గంటల పాటు స్క్రీన్ పైన చూస్తారా లేరా అనే ప్రశ్నలు కూడా తనలో ఉండేవి అని తెలిపారు.
అయితే కొంతకాలం వరకు తన సినిమాలు వరుసగా విడుదల చేస్తూ వచ్చారు. అయితే గత రెండేళ్ల నుంచి కాస్త నెమ్మదిగా నటిస్తూ ఉన్నాను.. అయితే అది ఎవరు తప్పు కాదు తను నటించిన సినిమాలు వర్కౌట్ కాకపోవడమే కాకుండా తనకు అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల అంత గొప్పగా కనిపించలేకపోయానని తెలిపారు. అయితే తనకున్న అనారోగ్య సమస్యలను తెలుపలేదు.. అందుకే తాను కాస్త బ్రేక్ తీసుకున్నానంటు తెలిపారు సల్మాన్. మమ్ముట్టి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దుల్కర్ సెకండ్ షో అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి ఉస్తాద్ హాస్టల్ అనే సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్నారు. ఆ తర్వాత బెంగళూరు డేస్, విక్రమాదిత్యన్, చార్లీ, కింగ్ ఆఫ్ కోత, సీతారామం తదితర చిత్రాలలో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.