చరణ్ కు జంటగా చందమామ.. ప్రేక్షకులలో ఈ కాంబినేషన్ కు వున్న క్రేజే వేరబ్బా..!!
*మగధీర మూవీతో చరణ్ కు లక్కీ హీరోయిన్ గా మారిన కాజల్
* వీరిద్దరూ కలిసి నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్
*ఈ క్యూట్ పెయిర్ కి ఆడియన్స్ లో సూపర్ రెస్పాన్స్..!!
గ్లోబల్ స్టార్ రాంచరణ్, టాలీవుడ్ చందమామ కాజల్ జంటకు ప్రేక్షకులలో ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాతో వీరిద్దరూ మొదటిసారి కలిసి నటించారు.. ఆ సినిమాలో వీరి జంటకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. కాలభైరవగా రాంచరణ్ యాక్షన్ అలాగే యువరాణి మిత్రవిందగా కాజల్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.. మగధీర మూవీ ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అంతేకాదు ఈ సినిమాతో కాజల్, రాంచరణ్ ఇద్దరూ కూడా తమ కెరీర్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.. ఈ సినిమాతో ఈ జంటకు హిట్ పెయిర్ గా మంచి గుర్తింపు లభించింది.. మగధీర సినిమా తరువాత కాజల్, రాంచరణ్ జంటగా ‘మెరుపు’ అనే సినిమా మొదలైంది.. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా ముందుకు సాగలేదు.. దీనితో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు.. కానీ టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ‘నాయక్’ సినిమాలో వీరిద్దరూ మరోసారి కలిసి నటించారు..