దసరా ను షేక్ చేసిన బాలకృష్ణ మ్యానియా !

Seetha Sailaja
ఈసారి దసరా పండుగకు టాప్ హీరోల సినిమాలు ఏమి విడుదలకాలేదు. రజనీకాంత్ ‘వేటగాడు’ సినిమా వచ్చినా ఆసినిమాను చూసి ప్రేక్షకులు భారంగా నిట్టూర్చారు. దీనితో ధియేటర్లలో ‘దసరా’ పండుగ హడావిడి ఏమాత్రం కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎవరు ఊహించని విధంగా ‘ఆహా’ ఓటీటీ యాప్ లో బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ 4’ సీజన్ క్రియేట్ చేస్తున్న హంగామా చాలామంది దృష్టిని ఆకర్షించింది.

సెలెబ్రెటీల టాక్ షోలకు స్పందన చాల ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ కు ఎవరు ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. ప్రభాస్ ఎపిసోడ్ కి సర్వర్లు క్రాష్ అయితే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఏకంగా అనేక చోట్ల బ్యానర్లు కూడ కట్టారు. వెలిశాయి. అల్లు అర్జున్ తో ప్రసారం అయిన ఎపిసోడ్ కు మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

అలాగే విశ్వక్ సేన్ అడవి శేష్ సిద్దూ జొన్నల గడ్డ లాంటి యంగ్ హీరోలతో బాలయ్య చేసిన అల్లరి ఆకార్యక్రమానికి హైలెట్ గా మారింది. ఇప్పుడు సీజన్ 4 కు రంగం సిద్ధం అయింది. దసరా నాడు ఈ కార్యక్రమానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ తో పాటు షో విశేషాలు పంచుకోవడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఏమి దొరకని ఒక మారుమూల ప్రాంతంలో జనం తమను కాపాడేవాడి కోసం ఎదురు చూస్తున్నప్పుడు బాలయ్య వచ్చి దుర్మార్గుల భరతం పట్టి ప్రజలు కోరినవి ఇచ్చి వాళ్లకు సంతోషపరిచే ట్రైలర్ ఓటీటీ ప్రేక్షకులకు బాగా నచ్చింది.

ఈ ట్రైలర్ యానిమేషన్ రూపంలో ఉన్నప్పటికీ డబ్బింగ్ సొంతంగా బాలయ్య చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. ‘సరిపోదా శనివారం’ మూవీతో సంగీత దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్న జేక్స్ బెజోయ్ ఈ ట్రైలర్ కు సంగీతం సమకూర్చడం. ఈసారి అన్ స్టాపబుల్ 4లో చాలామంది స్పెషల్ గెస్టులు ఉంటారని టాక్ నడుస్తోంది. ఈ షో పై రోజురోజుకి అంచనాలు పెరిగి పోతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: