పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయింది అంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ప్రత్యేక సందడి వాతావరణం కనబడుతూ ఉంటుంది. పెళ్లిలో సీజన్ ద్వారా పెద్ద మొత్తంలో వ్యాపారస్తులు కూడా లాభపడుతూ ఉంటారు ఇకపోతే గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెళ్లిళ్లు జరగలేదు పెళ్లి ముహూర్తాలు లేకపోవడంతో ఎక్కడికక్కడ పెళ్లిళ్లు అన్ని ఆగిపోయాయి ఇక ఇప్పటికే సెట్ అయిన పెళ్లిళ్లు కూడా మరికొన్ని రోజుల్లో జరగడానికి రెడీ అయ్యాయి ఇక తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెళ్లి ముహూర్తాలు మొదలయ్యాయి. ఆగస్టు చివర వారం వరకు పెళ్లి ముహూర్తాలు ఉండగా ఆ సమయంలో చాలానే పెళ్లిళ్లు జరిగాయి.
ఆ తర్వాత నుంచి వివాహానికి అనువైన శుభ ఘడియాలు రాలేదు దానితో అప్పటినుండి పెళ్లిళ్లు పెండింగ్లో పడిపోయాయి. ఇక మరోసారి పెండ్లి ముహూర్తాలు వచ్చేశాయి. అక్టోబర్ 5 వ తేదీ నుండి పెళ్లిలకు కావలసిన శుభ ఘడియలు మొదలయ్యాయి. దీంతో మరో సారి పెళ్లి భాజాలు పెద్ద ఎత్తున మూగనున్నాయి. ఇక ఈసారి వరుసగా మూడు నెలల పాటు వరుసగా పెళ్లిలకు అనువైన మంచి ముహూర్తాలు వస్తున్నాయి. దీంతో.. పెళ్లిళ్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఉండనున్నట్టు పంతుళ్లు చెప్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ కావడంతో ఇప్పటికే ఫంక్షన్ హాల్ లో బుకింగ్స్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.
ఇక అక్టోబర్ నెలలో పెళ్లిళ్లు , గృహప్రవేశాలు , ఉపనయనాలు తదితర శుభకార్యాలకు చాలా అనుకూలంగా ఉందని తెలంగాణ అర్చక సంఘం కన్వీనర్ శ్రీరంగం గోపీ కృష్ణమాచార్యులు వివరించారు. పెళ్లి ఘడియలు అక్టోబర్ 12వ తేదీ నుండే మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అక్టోబరు 12 వ తేదీ తో ఈ నెలలో ..13, 16, 20, 27 కాగా.. ఇక నవంబర్ నెలలో 3, 7, 8, 9, 10, 13, 14, 16, 17 తేదీల్లో మంచి ముహూర్తాలుండగా.. ఇక డిసెంబర్ నెలలో అయితే.. 5, 6, 7, 8, 11, 12, 14, 15, 26 తేదీల్లో పెళ్లికి మంచి ఘడియలున్నట్టు పురోహితులు చెప్తున్నారు. ఇలా ఈ మూడు నెలల్లో కలిపి మొత్తంగా సుమారు 25 రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉన్నట్టు పంతుళ్లు చెప్తున్నారు. ఇలా ఈ మూడు నెలల్లో చాలా పెళ్లి ముహూర్తాలు ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.