ఆ విషయంలో బాలయ్య భార్య వసుంధర..చిరంజీవి భార్య సురేఖ ఇద్దరూ ఒకటే ..ఎప్పటికీ మార్చలేం..!

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మాత్రమే కాదు.. వాళ్ళ భార్యలు కూడా ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు . సోషల్ మీడియా పుణ్యమా అంటూ అభిమానులతో ఫేస్ టు ఫేస్ ఛాట్ కూడా చేస్తున్నారు. అంతేకాదు చాలామంది స్టార్ హీరోలు భార్యలను కూడా విపరీతంగా ఫాలో అవుతూ ఉన్నారు . మరి ముఖ్యంగా సీనియర్ హీరోస్ అయిన చిరంజీవి భార్య సురేఖ..  బాలయ్య భార్య వసుంధరల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.


మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు చిరంజీవి - బాలయ్య . ఇప్పటికీ హీరోలుగా తమదైన స్టైల్ లో ముందుకు వెళ్తున్నాడు . కాగా చిరంజీవి - బాలయ్య ఈ రేంజ్ లో ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండడానికి కారణం సురేఖ - వసుంధర అనే అంటున్నారు అభిమానులు . అఫ్కోర్స్ ఈ హీరోలకి టాలెంట్ ఉంది . కష్టపడే తత్వం ఉంది. కానీ ఒక పక్క ఫ్యామిలీ లైఫ్ ను మరొక పక్క ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలి అంటే కచ్చితంగా ఇంట్లోని వైఫ్ సపోర్ట్ అవసరం .


ఇంట్లో వైఫ్ అన్ని పనులు చక్కగా చేసుకోగలిగినప్పుడే ఆ హీరో షూట్ లో ప్రశాంతంగా సీన్స్ లో నటించగలడు . ఆ విషయంలో నిజంగా చిరంజీవి - బాలయ్య చాలా చాలా అదృష్టవంతులు . బాలయ్య భార్య వసుంధర .. చిరంజీవి భార్య సురేఖ ఆ ఇద్దరు హీరోలను బాగా అర్థం చేసుకున్నారు . ఎప్పుడు కూడా వాళ్ళని మాతో టైం స్పెండ్ చేయట్లేదు అని విసిగించేవారు కాదట.  పిల్లల బాధ్యతలను కుటుంబ బాధ్యతలను చక్కగా చూసుకోవడం వల్ల చిరంజీవి - బాలయ్య షూట్ లో ప్రశాంతంగా ఉండేవారట . పరోక్షంగా వాళ్ళు స్టార్ హీరోలు అవ్వడానికి కారణం సురేఖ - వసుంధరలే అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. అంతేకాదు ఇద్దరూ మంచితనానికి మరో మారుపేరు లాంటివాళ్ళు . వాళ్లను తిట్టినా కూడా సరే ఇంటికి వస్తే మర్యాదపూర్వకంగా మాట్లాడుతారు.  ఆ విషయంలో వీళ్ళిద్దరిని ఎప్పటికీ మార్చలేము అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: