స్టార్ హీరో చంప పగలగొట్టిన స్టార్ హీరోయిన్.. ఎందుకొ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Amruth kumar
ప్ర‌స్తుతం ఓ స్టార్ హీరో గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది .. గతంలో ఆ హీరోను చంప మీద కొట్టానని ఒక హీరోయిన్ స్వయంగా తానే చెప్పడం గమనార్హం. దానికి కారణం ఏంటో కూడా ఆమె చెప్పకు వచ్చింది . ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు .. ఇది ఎప్పుడు జరిగిందో ఇక్కడ చూద్దాం . సౌత్ ఇండియన్ స్టార్ హీరో కమలహాసన్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు . ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలో నే స్టార్ హీరోల జాబితా లో చోటు దక్కించుకున్నాడు . ఏ క్యారెక్టర్ లో నైనా అద్భుతంగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందగలడు . తన నటన , సినిమాలతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు .

అలాగే కల్కి సినిమాలో పవర్ఫుల్ విలన్ గా నటించి ప్రేక్షకుల కు మరోసారి దగ్గర అయ్యాడు . భారీ కలెక్షన్లు రాబట్టి న ఈ సినిమాలో కమలహాసన్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి . ఇక అయితే కమలహాసన్ గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించారు. అలాగే కమల్ .కే విశ్వనాథ్ డైరెక్షన్లో ఎన్నో గొప్ప సినిమాల్లో నటించారు. ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలలో స్వాతిముత్యం, సాగర సంగమం, శుభసంకల్పం వంటి గొప్ప సినిమాలు ఉన్నాయి. అయితే వీటిలో స్వాతిముత్యం సినిమా షూటింగ్ సమయంలో.. కమల్ కు హీరోయిన్ రాధిక దగ్గర నుంచి ఓ అరుదైన సంఘటన ఎదురయింది .

ఈ సినిమాలో వచ్చే ఓ పాటలో రాధిక, కమల్‌ను చెంప మీద కొట్టాలి. అయితే ఈ సన్నివేశం కోసం రిహాసిల్ చేస్తున్న సమయంలో.. రాధిక కమ‌ల్‌ను నిజంగా చెంప మీద కొట్టిందట. ఇక దీంతో అక్కడున్న వారంత ఒక్కసారిగా షాక్ అయ్యారట. తర్వాత హీరో వచ్చి కొట్టినట్టు నటించాలి కానీ ఇలా గట్టిగా కొట్టడం కాదని ఫన్నీ గా ఆమె ను అన్నాడట ఈ విషయాన్ని రాధిక‌ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకో వచ్చింది . ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: