బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేసిన సౌత్ స్టార్స్ .. ఎందుకు నో చెప్పారంటే..!?

Amruth kumar
 గత కొన్ని సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా ట్రెండ్‌ గట్టిగా నడుస్తున్న విషయం తెలిసిందే . సౌత్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు అటు నార్త్ లోను మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. అలాగే హిందీ సినిమాల్లో టాలీవుడ్ నుంచి కొలీవుడ్ వరకు స్టార్ నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు . ఇప్పటికే చాలా మంది సౌత్ నటులు బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే  కొందరు స్టార్స్ మాత్రం బాలీవుడ్ నుంచి వచ్చిన భారీ బడ్జెట్ సినిమాల అవకాశాలను వదులుకున్నారు. కొంత మంది స్టార్ హీరోల సినిమాలను కూడా వదులుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, క‌న్న‌డ హీరో యాష్ వంటి సౌత్ హీరోలు హిందీ అవకాశాలను తిరస్కరించారు. అయితే వీరు వద్దనుకున్న సినిమాలు విడుదలయ్యాక మంచి విజయాలు అందుకున్నాయి. అలాగే వీరు నో చెప్పిన పాత్ర‌లకు ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ కూడా వచ్చింది. ఇంతకీ సౌత్ నుంచి ఏ హీరో ఏ సినిమాను వదులుకున్నారు ఇక్కడ చూద్దాం.

సల్మాన్ ఖాన్ హీరోగా 2017లో విడుదలైన  ‘బజరంగీ భాయిజాన్’  లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. నిజానికి ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాల్సింది కాదు .. అయితే ఈ సినిమాలో ముందుగా అల్లు అర్జున్ హీరోగా అనుకున్నారు .. బన్నీ ఈ సినిమాను తిరస్కరించాడని ఫిలిం ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. బ‌న్నీ ఈ సినిమాను  రిజెక్ట్  చేయడానికి గల కారణాలు ఇంకా తెలియదు .. సల్మాన్ ఖాన్ మాత్రం ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక గత సంవత్సరం సెన్సేషనల్ దర్శకుడు  సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచి బాలీవుడ్ హీరో రణబీర్ కు సౌత్ లో కూడా మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా ఆఫర్ ముందుగా టాలీవుడ్ హీరో మహేష్ బాబు కి వచ్చిందని అంటారు.

అలాగే 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైఫలి ఖాన్ మూవీ ‘లాల్‌ కప్తాన్‌’ చిత్రం గొప్ప ప్రశంసలు అందుకుంది . ఈ సినిమా ఆఫర్ మొదట యాష్ కి వచ్చిందట. అయితే ఆ సమయంలో ఆయనకి బాలీవుడ్ సినిమాల్లో నటించాలనే ఉద్దేశం లేదట కాబట్టి ఆయన ఆ సినిమాను  తిరస్కరించాడు. ఇప్పుడు మాత్రం హిందీలో తెర్కక్కుతున్న రామాయణం సినిమాలో నటిస్తున్నాడు. అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో నాగ చైతన్య నటించాడు. ఈ సినిమాలో నటించేందుకు విజయ్ సేతుపతికి ఆఫర్ వచ్చింది. కానీ, అతను దానిని తిరస్కరించాడు. దీంతో చైతూ ఈ చిత్రంలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: