ఆ మూడు నిమిషాల పని కోసం..కీర్తి సురేష్ కు ఏకంగా ఐదు కోట్ల ఆఫర్ చేసిన స్టార్ హీరో..!

Thota Jaya Madhuri
ఒకప్పుడు ఇండస్ట్రీలో హై రెమ్యూనరేషన్ అందుకునేది అంటే కొందరు స్టార్ హీరోలు మాత్రమే . అప్పట్లో కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకోవడమే పెద్ద విషయం . అలాంటిది ఇప్పుడు చిన్నాచితక హీరోస్.. అసలు టాలెంటే లేని హీరోలు కూడా కోటి కి పైగానే వసూళ్ళు చేస్తున్నారు . సినిమా ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది అనడానికి ఇదే ఒక నిదర్శనం . అంతేకాదు ఒకప్పుడు హీరోయిన్స్ కి చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చే వాళ్ళు .


కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక స్టార్ హీరోకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారో.. అంతకు పైగానే కొందరు హీరోయిన్స్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.  మరి ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీస్ అయితే ఆ విషయంలో కెవ్వు కేక అనే చెప్పాలి. కాగా ఈ మధ్యకాలంలో డబ్బు కోసం కొందరు హీరోయిన్స్ బోల్డ్ పాత్రల్లో కూడా నటిస్తున్నారు . ఎప్పుడు సైలెంట్ గా ఉంటే తమన్నా జీ కర్దా వెబ్ సిరీస్ లో ఎలా రెచ్చిపోయి నటించిందో చూసాం .


అయితే రీసెంట్ గానే కీర్తి సురేష్  సైతం బాలీవుడ్ లో బోల్డ్ పాత్రలు చేయడానికి సిద్ధమవుతోంది అంటూ వార్తలు వినిపించాయి.  తాజాగా కీర్తి సురేష్ గురించి బాలీవుడ్ మీడియాలో ఓ వార్త కోడై కూస్తుంది. కీర్తి సురేష్ ను ఐటెం సాంగ్ లో నటించమని ఒక బాలీవుడ్ హీరో తెగ ఫోర్స్ చేస్తున్నారట . మహానటి సినిమా చూసినప్పటి నుంచి ఆమెకు తెగ ఫ్యాన్ అయిపోయిన ఈ హీరో ఎలాగైనా ఒక్కసారైనా ఐటమ్ సాంగ్ చేయించాలి అంటూ తెగ ట్రై చేస్తున్నాడట.  అంతేకాదు ఏకంగా దానికోసం ఆయన ఐదు కోట్లు ఆఫర్ కూడా చేశారట . ఐటెం సాంగ్ అంటే మూడు నిమిషాలు ఉంటుంది . ఆ మూడు నిమిషాల పాట కోసం ఐదు కోట్లా అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు . మరికొందరు కీర్తి సురేష్ అందం అలాంటిది అంటూ ఆ హీరోకి ఐదు కోట్లు ఇచ్చిన తక్కువే అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరి కీర్తి సురేష్ ఆ ఐదు కోట్లు తీసుకొని ఐటెం సాంగ్ చేస్తుందో..? లేదో..? చూడాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: