టాలీవుడ్ స్టార్
హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్
ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..
టాలీవుడ్ లో చిన్న వయసులో ఊహించని స్టార్ ఇమేజ్ తెచ్చుకుని అప్పటి వరకు వున్న రికార్డ్స్
ఎన్టీఆర్ బ్రేక్ చేసాడు..
సింహాద్రి సినిమాతో
ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం తారా స్థాయికి చేరింది.. ఆ క్రేజ్ కోసం చాలా మంది మీడియం రేంజ్ హీరోలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.. కానీ
ఎన్టీఆర్ మాత్రం చిన్న వయసులోనే ఆ క్రేజ్ సంపాదించుకున్నాడు..
ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్
ఇండియా క్రేజ్ తో దూసుకుపోతున్నాడు.. అయితే
ఎన్టీఆర్ ప్రొఫెషనల్ లైఫ్ ఎంత అద్భుతంగా వుందో ఫ్యామిలీ లైఫ్ కూడా అంతే అద్భుతంగా వుంది..
ఎన్టీఆర్ తన
వైఫ్ లక్ష్మి ప్రణతితో ఎంతో సంతోషంగా వున్నారు.. వీరిద్దరి వివాహం 2011 లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది..
ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణ,
తండ్రి హరికృష్ణ దగ్గరుండి వీరి వివాహం ఎంతో వైభవంగా జరిపించారు.. ప్రస్తుతం ఈ క్యూట్ జంటకు ఇద్దరు కొడుకులు కూడా వున్నారు.. అయితే
లక్ష్మీ ప్రణతి బ్యాక్ గ్రౌండ్ గురించి కొన్ని కీలక విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
లక్ష్మి ప్రణతి ప్రస్తుత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి వరుసకి మనవరాలు అవుతుంది.. చంద్రబాబు బాబు గారి మేనకోడలి కూతురే
లక్ష్మీ ప్రణతి.. ప్రణతి ఇంటర్మీడియట్ అవ్వగానే అంటే మేజర్ అవ్వకుండానే
ఎన్టీఆర్ తో
పెళ్లి ఫిక్స్ చేశారట..
ఎన్టీఆర్ మాత్రం అలా చేయకండి చట్టపరంగా తాను మేజర్ అయినప్పుడే
పెళ్లి చేయండి అని చెప్పి రెండేళ్లు ఎదురు చూసి ఎంతో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు..లక్ష్మీ ప్రణతి 1992
మార్చి 18
హైదరాబాద్ లో జన్మించారు..
తండ్రి నార్నె
శ్రీనివాస్ గారు
బిజినెస్ మ్యాన్ అలాగే ప్రైవేట్ న్యూస్ ఛానల్ కూడా వుంది..
ఎన్టీఆర్, ప్రణతి వివాహం దాదాపు పది కోట్ల ఖర్చుతో జరిగింది.. వీరి పెళ్ళికి 3000 మందికి పైగా సెలబ్రేటీలు 12000 మందికి పైగా అభిమానులు హాజరు అయ్యారు. ప్రణతి సోషల్ మీడియకు చాలా దూరంగా వుంటారు
ఎన్టీఆర్ ని
పెళ్లి చేసుకున్నాక. ఒక
భార్య గా ఒక కోడలిగా, తల్లిగా ఇంటి భాద్యతలు ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు..