పెద్ద అల్లుడు పై బాలయ్య ప్రేమ మామూలుగా లేదుగా.. మరోసారి ఇచ్చి పడేసాడుగా..!

Amruth kumar
నట‌సింహం నందమూరి బాలకృష్ణ అంటే తెలుగుదనం, తెలుగుదనం అంటే బాలయ్య .. ఆయన దీవెనలో ఎంతో స్పెషాలిటీ ఉంటుంది .. తన నిండైనా మనసుతో ఎంతో సంతోషంగా దీవిస్తాడు.. తనకన్నా చిన్నవాళ్ళను తనకు బాగా నచ్చిన వాళ్లను, తనకు కావాల్సిన వాళ్లను ఎదురుపడితే బాలయ్య దీవించకుండా వదిలిపెట్టరు. తల మీద కుడి చేయి పెట్టి తన దీవెన ఇచ్చి పంపిస్తాడు .. మరీ ముఖ్యంగా తన కుటుంబ సభ్యుల విషయంలో విడిచిపెట్టరు. తప్పకుండా అక్కడ బాలయ్య దీవెన ఉండాల్సిందే అంటారు.

ఇక తాజాగా ఇప్పుడు మామ, అల్లుడు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది  .. ఒక ఈవెంట్లో బాలయ్య తన పెద్ద అల్లుడు లోకేష్ ఎదురుపడ్డారు .. బాలయ్య కార్ దిగి లోపలికి వెళ్లి బయటకు వస్తున్న సమయంలో లోకేష్ అక్కడ కనిపిస్తాడు.. ఇక దీంతో వెంటనే బాలయ్య లోకేష్ ని ఆశీర్వదించాడు.. తులత లోకేష్ ఏదో ఆలోచనలో ఉండగా ఆ తర్వాత మామ చేయి ఎత్తడం చూసి వెంటనే తన తల కిందకు దించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ తర్వాత బాలయ్య వెనక వెళ్లి మావయ్యను కారు దగ్గరుండి మరీ ఎక్కించి పంపించారు.

సీటు లోప‌ల‌కి వెళ్ల‌గానే లోకేష్ డోర్ వేసి పంపించారు. ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇది చూసిన నంద‌మూరి - నారా అభిమానులు సంబ‌ర ప‌డుతున్నారు. పెద్ద‌ల్లుడు అంటే మామ‌కి ఎంత ఇష్టమో చూసారా? అంటూ ఆ వీడియోని షేర్ చేస్తున్నారు. మామ బాల‌య్య విష‌యంలో అల్లుడు లోకేష్ ఎంతో చ‌నువుగా ఉంటారు. బాల‌య్య బాబు గారు, బాల‌య్య మావ‌య్య అంటూ ముద్దుగా పిలుస్తుంటారు. బాల‌య్య సినిమా రికార్డుల గురించి, పొలిటిక‌ల్ రికార్డుల గురించి చిన‌బాబు ఎంతో గ‌ర్వంగా చెప్పుకుంటారు. ఆ మ‌ధ్య ఓ రాజ‌కీయ వేదిక‌పై లోకేష్ త‌ల్లి నారా భువ‌నేశ్వ‌రిని కూడా బాల‌య్య దీవించిన సంగ‌తి తెలిసిందే. ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అయింది. ఆ త‌ర్వాత కుమారుడు మోక్ష‌జ్ఞ‌ని కూడా బాల‌య్య ఇలాగే దీవించి అభిమానుల్ని అల‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: