పిలిచి ఆఫర్ ఇచ్చిన సరే.. ప్రభాస్ సినిమా రిజెక్ట్ చేసిన శ్రీముఖి.. ఎందుకంటే..?
మరీ ముఖ్యంగా బుల్లితెర రాములమ్మ అంటూ ముద్దుగా అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. శ్రీముఖి యాంకర్ గానే కాదు పలు సినిమాల్లో కూడా నటించింది. హీరోయిన్గా నటించింది అని చెప్పలేము కానీ లీడ్ క్యారెక్టర్స్ లోనే కనిపించింది . శ్రీముఖి చాలామంది స్టార్స్ ..స్టార్ హీరోస్ కి సిస్టర్ పాత్రలో కూడా మెరిసింది . అల్లు అర్జున్ - రామ్ పోతినేని వాళ్లతో సిస్టర్ క్యారెక్టర్ లో మెప్పించింది . అయితే ప్రభాస్ తో కూడా సిస్టర్ క్యారెక్టర్ లో ఒక సినిమా చేయాల్సింది.
కానీ శ్రీముఖినే రిజెక్ట్ చేసిందట . దానికి కారణం శ్రీముఖి.. ప్రభాస్ పై పెంచుకున్న విపరీతమైన ప్రేమ. ప్రభాస్ అంటే పడి చచ్చిపోతుంది శ్రీముఖి . ఈ విషయాన్ని చాలా సార్లు ఇంటర్వ్యూలో బయట పెట్టింది . అటువంటి శ్రీముఖికి "మిస్టర్ పర్ఫెక్ట్" సినిమాలో ప్రభాస్ సిస్టర్ గా నటించమంటూ ఆఫర్ వచ్చిందట . సెకండ్ కూడా ఆలోచించుకోకుండా చచ్చిన చేయను అంటూ ఓపెన్ గానే చెప్పేసిందట . ప్రభాస్ పక్కన గర్ల్ ఫ్రెండ్ గా లేదా ప్రభాస్ కి వేరే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను కానీ సిస్టర్ క్యారెక్టర్ గా చేయను అంటూ తెగేసి చెప్పేసిందట. అది విని నిర్మాత అదేవిధంగా డైరెక్టర్ కూడా షాక్ అయిపోయారట. ఆఖరికి ఈ విషయం ప్రభాస్ వద్దకు కూడా వెళ్లి ఆయన తెగ నవ్వేసుకున్నాడట . అలా ప్రభాస్ పై ఉన్న పిచ్చి ప్రేమతో శ్రీముఖి మంచి ఆఫర్ మిస్ చేసుకుంది. ప్రజెంట్ పలు షోస్ హోస్ట్ చేస్తూ తనదైన స్టైల్ లో ముందుకు వెళుతుంది శ్రీముఖి..!!
*