ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో రీ రిలీజ్ల జోరు పెరిగిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితం దాదాపుగా రీ రిలీజ్లు అనేవి చాలా తక్కువగా జరిగేవి. ఇక వాటికి కూడా ప్రేక్షకుల నుండి పెద్దగా రెస్పాన్స్ ఏమీ వచ్చేది కాదు. కానీ ఈ మధ్య కాలంలో ఏదైనా స్టార్
హీరో పుట్టిన రోజు వచ్చింది అంటే చాలు ఆ హీరోకు సంబంధించిన సినిమాలను రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అయిన సినిమాలలో చాలా సినిమాలకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.
ముఖ్యంగా
లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
మూవీ లు రీ రియల్ అయినప్పుడు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం
ప్రేమ కావాలి అనే
సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో
ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఇషా చావ్లా హీరోయిన్గా నటించింది. ఈ ఇద్దరు కూడా ఈ సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఇకపోతే
విజయ్ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ను అందుకుంది.
ఇకపోతే ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో రీ రిలీస్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా ఈ
మూవీ బృందం వారు విడుదల చేశారు. ఈ
మూవీ ని
అక్టోబర్ 26 వ తేదీన రీ రిలీస్ చేయనున్నట్లు ఈ
మూవీ యూనిట్ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఆ
పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.