చిరంజీవికి చుక్కలు చూపించిన వెంకటేష్ .. దెబ్బకి రికార్డ్స్ బద్దలయ్యాయి గా..!

Amruth kumar
ఇక టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ సినిమాలలో గ్యాంగ్ లీడర్ కూడా ఒకటి .. 1991 లో విజయ బాపినీడు దర్శకత్వం లో ఈ సినిమా తెర‌కెక్కింది . ఈ మూవీ లో చిరంజీవి కి జంటగా విజయశాంతి హీరోయిన్గా నటించారు .. ఈ మూవీతో నే చిరంజీవికి మాస్ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ వచ్చిందని కూడా అంటారు .. అలాగే బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పిలహరి సంగీతం అందించడం తో సినిమా పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి .. ఎన్నో అంచనాల మధ్య 1991 లో ఈ సినిమా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది .

అయితే ఈ సినిమా తర్వాత అందరూ గ్యాంగ్ లీడర్ ఊపులో ఉన్న‌రు,, అయితే ఈ సినిమాకు ముందు వెంకటేష్ బొబ్బిలి రాజా సినిమాతో వచ్చాడు . స్టార్ డైరెక్టర్ బి గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది . ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది. అయితే ఈసారి వెంకటేష్ మరో విభేన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి దర్శికత్వంలో చంటి సినిమాలో నటించాడు. ఈ సినిమాలో వెంకటేష్‌కు జంట గా మీనా నటించారు . కీలకపాత్రలో నాజర్ తదితరులు కనిపించారు.

ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించిగా పాటలు కూడా మ్యూజికల్ గా సూపర్ హిట్ గా నిలిచాయి. 1991 లో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చి ఏడు కోట్లకు పైగా కలెక్షన‌న్లు రాబట్టి చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా నే అధిగ మించింది. ఇక చంటి సినిమా ఏకంగా తొమ్మిది కోట్ల కలెక్షన్ రాబట్టింది. అంతేకాకుండా 1992లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఈ సినిమాను బీట్ చేస్తూ చిరంజీవి ఘరానా మొగుడు 10 కోట్ల కలెక్షన్లను అధికమించి అదే సంవత్సరం మరో ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం విశేషం. ఇలా చంటి సినిమాతో వెంకటేష్ చిరుకు చెమటలు పట్టించాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: