అత్యంత భారీ లాభాలను అందుకున్న టాప్ టెన్ తెలుగు మూవీ.. ఆ ప్లేస్లో దేవర..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక లాభాలను అందుకున్న సినిమాలలో టాప్ స్థానంలో ఉన్న సినిమాలు ఏవి. ఏవి అందులో దేవర మూవీ ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.
ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ సినిమాకు 508 కోట్ల లాభాలు వచ్చాయి.
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించగా ... అనుష్క , తమన్నా హీరోయిన్లుగా రూపొందిన బాహుబలి 1 ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 118 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 186 కోట్ల లాభాలను అందుకుంది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమాకు 370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ సినిమాకు 169.25 కోట్ల లాభాలు వచ్చాయి.
రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 451 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీకి 163.03 కోట్ల లాభాలు వచ్చాయి.
తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా  ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమాకి 29.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 127.95 కోట్ల లాభాలు వచ్చాయి.
అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 84.34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ కి 75.88 కోట్ల లాభాలు వచ్చాయి.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి 182.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఇప్పటికే ఈ సినిమాకు 57.90 6 కోట్ల లాభాలు వచ్చాయి. ఈ మూవీ కి ఇప్పటికి కూడా మంచి కలెక్షన్లు వస్తున్నాయి. దానితో ఈ మూవీ లాభాలు చాలా ఎక్కువగా రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: