విశ్వంభర టీజర్ తో కుర్ర హీరోలకు చెమటలు పట్టించిన చిరు.. టాప్ 5 లో ఏకంగా ఆ ప్లేస్లో..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా , ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని చాలా రోజుల క్రితమే వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క టీజర్ను విడుదల చేసింది.

ఈ సినిమా టీజర్ విడుదల వేడుకలో భాగంగా ఈ మూవీ బృందం వారు మాట్లాడుతూ చిరంజీవి కుమారుడు అయినటువంటి రామ్ చరణ్ "గేమ్ చెంజర్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ మూవీ ని సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి అనుకుంటున్నారు. ఆ సినిమాకు ఛాన్స్ ఇవ్వడం కోసం మేము సంక్రాంతి బరి నుండి తప్పుకుంటున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇకపోతే విశ్వంభరా మూవీ ని మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా విడుదల చేసిన ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ఈ సినిమా టీజర్ విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాల టీజర్ల లిస్టులో ఏకంగా నాలుగవ స్థానంలో నిలిచింది. రాధే శ్యామ్ మూవీ టీజర్ 46.67 మిలియన్ వ్యూస్ తో మొదటి స్థానంలో నిలవగా , సర్కారు వారి పాట మూవీ టీజర్ 23.06 మిలియన్ వ్యూస్ తో రెండవ స్థానంలోనూ , ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ వీడియో 22.52 మిలియన్ వ్యూస్ తో మూడవ స్థానంలోనూ , విశ్వంభర మూవీ టీజర్ 20.95 మిలియన్ వ్యూస్ తో నాలుగవ స్థానంలోనూ , బ్రో మూవీ టీజర్ 20.50 మిలియన్ వ్యూస్ తో ఐదవ స్థానంలోనూ నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: