వావ్: దేవర ఓటిటి రిలీజ్ డేట్ లాక్.. వచ్చేది అప్పుడే.. స్ట్రిమింగ్ ఎక్కడంటే..?

Divya
RRR తరువాత ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర.. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ తో దూసుకుపోయింది. అయితే ఎట్టకేలకు ఇటీవలే రూ .500 కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టింది దేవర చిత్రం. దీంతో అటు చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా చాలా సంతోషంతో ఉన్నారు. కొరటాల శివ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. కానీ ఇందులో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించేలా కనిపించడం లేదు అయినా కూడా ఈ సినిమా ఫ్యాన్స్  ను అయితే బాగా మెప్పించింది. ఇక రెండవ భాగం కూడా భారీ హైప్ తోనే నిర్మిస్తున్నారు.

దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందా అంటూ అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రిమింగ్ కి నవంబర్ 8వ తేదీ లేదా 15వ తేదీన రాబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్ భారీ ధరకే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్ వంటి భాషలలో ఒకేసారి ఈ సినిమా స్ట్రిమింగ్ కి సిద్ధమవుతోందట. ఓటిటి రిలీజ్ డేట్ సంబంధించి త్వరలోనే నెట్ ఫ్లిక్ అధికారికంగా ప్రకటన చేస్తుందేమో చూడాలి.
దేవర చిత్రాన్ని రూ .150 కోట్ల రూపాయలకు పైగా ఓటిటీ డిల్ కుదిరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదలైన ఆరు వారాల తర్వాత స్ట్రిమ్మింగ్ అయ్యే విధంగా ఓటిటి సంస్థ డీల్ కుదుర్చుకున్నదట. మరి ఓవరాల్ గా ఎంతటి కలెక్షన్స్ తో దేవర సినిమా సరిపెట్టుకుంటుందో చూడాలి మరి. జాన్వి కపూర్, శృతి మరాటే, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్ తదితరు నటీనటులు సైతం ఇందులో నటించారు. ప్రస్తుతం దసరా సెలవులు కూడా అయిపోవడంతో కలెక్షన్స్ కూడా వచ్చేలా పెద్దగా కనిపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: