విశ్వంభర టీజర్ ను ఆ హీరో ఫ్యాన్స్ టార్గెట్ చేశారా.. కావాలనే విషం చిమ్మారా?

Reddy P Rajasekhar
చిరంజీవి మల్లిడి వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కిన విశ్వంభర మూవీ టీజర్ తాజాగా విడుదల కాగా టీజర్ బాగానే ఉన్నా టీజర్ విడుదలైన కొన్ని నిమిషాలకే నెట్టింట ట్రోల్స్ వచ్చాయి. ఈ ట్రోల్స్ వెనుక ప్రధానంగా ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ ఉన్నారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆ స్టార్ హీరో సినిమా ట్రైలర్ రిలీజ్ సమయంలో, సినిమా రిలీజ్ సమయంలో కొంతమంది కావాలనే టార్గెట్ చేసి విషం చిమ్మారు.
 
అయితే తమ హీరో సినిమాను మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేశారని భావించి ఆ హీరో అభిమానులు విశ్వంభర టీజర్ ను టార్గెట్ చేశారనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. విశ్వంభర టీజర్ గ్రాఫిక్స్ విషయంలో కొన్ని తప్పులు జరగడం వాస్తవమే కానీ మరీ తీసిపారేయదగ్గ స్థాయిలో అయితే టీజర్ లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. విశ్వంభర సినిమా టీజర్ పై వచ్చిన ట్రోల్స్ సినిమా బిజినెస్ పై ప్రభావం చూపుతున్నాయి.
 
విశ్వంభర సినిమాకు ఓటీటీ డీల్ సైతం పూర్తి కావాల్సి ఉంది. విశ్వంభర థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులకు బాగానే డిమాండ్ నెలకొంది. అయితే చిరంజీవి గత సినిమా భోళా శంకర్ మేకర్స్ ను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది. ఈ సినిమా నిర్మాతలకు ఒకింత భారీ నష్టాలను మిగిల్చింది. విశ్వంభర సంక్రాంతి డేట్ ను మిస్ చేసుకుని తప్పు చేసిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
పెద్ద సినిమాలకు సంక్రాంతి పండుగను మించిన మరో ఆప్షన్ అయితే ఉండదు. విశ్వంభర సినిమా విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవాల్ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా సరైన సినిమాలు లేక నిరాశ పరుస్తున్న మెగా హీరోలు 2025లో సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది. స్టార్ హీరో చిరంజీవి విశ్వంభర సినిమా చిరంజీవి మార్కెట్, కెరీర్ ను డిసైడ్ చేయనుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: