బాలయ్య ఇన్ని బ్లాక్ బస్టర్ మూవీలను రిజెక్ట్ చేశాడా.. అవన్నీ చేసి ఉంటే లెక్క వేరేలా ఉండేది..?

MADDIBOINA AJAY KUMAR
నందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరీర్లో చాలా సినిమాలను వదులుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. మరి బాలకృష్ణ వదులుకున్న బ్లాక్ బాస్టర్ మూవీలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.
కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి మూవీ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. ఇకపోతే సింహాద్రి మూవీ కథను విజయేంద్ర ప్రసాద్ మొదట బాలకృష్ణ కోసమే తయారు చేశాడట. అది బాలకృష్ణకు వినిపించగా ఇది వరకే ఈ జోనర్ సినిమాలు చాలా చేశాను అని ఈ కథను రిజెక్ట్ చేశాడట. దానితో ఆ కథతో ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి ఈ సినిమాను చేశాడట.
చాలా సంవత్సరాల క్రితం వెంకటేష్ హీరోగా మీనా హీరోయిన్గా చంటి అనే మూవీ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీని మొదటగా బాలకృష్ణ తో చేయాలి అనుకున్నారట. కానీ బాలకృష్ణ రిజెక్ట్ చేయడంతో వెంకటేష్ తో చేశారట. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
నాగార్జున హీరోగా విజయశాంతి హీరోయిన్గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన జానకి రాముడు సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని కూడా బాలకృష్ణతో  చేయాలి అని మేకర్స్ అనుకున్నారట. కానీ బాలకృష్ణ రిజెక్ట్ చేయడంతో నాగార్జునతో చేశారట.
రాజశేఖర్ హీరోగా రూపొందిన సింహరాశి మూవీ ని మొదట బాలకృష్ణ తో చేయాలి అనుకున్నారట. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో రాజశేఖర్ తో చేశారట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్ మూవీ బ్లాక్ బస్టర్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మొదట గోపీచంద్ మలినేని , బాలకృష్ణ తో చేయాలి అనుకున్నాడట. ఆయన రిజెక్ట్ చేయడంతో రవితేజతో చేశాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: