పద్ధతి మార్చుకో జక్కన్న.. తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేయండి ?

Veldandi Saikiran

 సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి పై ట్రోలింగ్ జరుగుతుంది. చిన్న చిన్న సినిమాలు భారీగా కలెక్షన్లు రాబడుతున్నాయని... జక్కన్న తీసిన సినిమాలు... కూడా... వెనుకబడి పోతున్నాయని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.  ఏళ్ల తరబడి జక్కన్న సినిమాలు చేస్తే... ఆరు నెలల్లో చేసిన తక్కువ బడ్జెట్ సినిమా... జక్కన్న సినిమాను బ్రేక్ చేస్తున్నాయని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్స్ తో పాటు చూపించి ట్రోలింగ్ చేస్తున్నారు.
 జక్కన్న ఇటీవల తీసిన ఆర్ఆర్ ఆర్, బాహుబలి రెండవ భాగం సినిమాలు బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు దాదాపు 2000 కోట్ల వరకు రాబట్టగలిగాయి. అయితే ఈ రెండు సినిమాలు చేయడానికి రాజమౌళి చాలా సమయం తీసుకున్నాడు. హీరోల సమయాన్ని వృధా చేశాడు. గ్రాఫిక్స్ విపరీతంగా పెట్టాడని కూడా కొంతమంది అంటున్నారు. అలాగే నిర్మాతలకు.. ఆర్థిక భారం అయ్యేలా సినిమాలు చేశాడని కూడా మండిపడుతున్నారు.
 అయితే అదే సమయంలో... ఇటీవల రిలీజ్ అయిన స్త్రీ  2 సినిమా బంపర్ హిట్ అయింది. ఈ సినిమా కేవలం 50 నుంచి 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఆగస్టు 15వ తేదీన.. రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 900 కోట్ల వరకు రాబట్టింది. అంటే ఆల్మోస్ట్ 1000 కోట్ల కలెక్షన్ల క్లబ్లో చేరింది అన్నమాట. ఇక ఓటిటి ప్లాట్ఫామ్  లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది.
అయితే ఇంత చిన్న సినిమా... అవలీలగా 1000 కోట్ల వరకు రాబట్టింది. అదే ఎస్ ఎస్ రాజమౌళి మాత్రం..  సంవత్సరాల పాటు సినిమాలు చేసి... పెద్దగా... కలెక్షన్లు రాబట్టింది కనిపించడం లేదు. కాబట్టి ఇకనైనా... తక్కువ సమయం అలాగే తక్కువ బడ్జెట్లో... మన జక్కన్న సినిమాలు చేయాలని కోరుతున్నారు.. కొంతమంది ఫ్యాన్స్. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు తో జక్కన్న సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: