టాలీవుడ్ : నిర్మాత‌లు మారండి... హీరోల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు మానుకోండి..?

Suma Kallamadi

* హీరోల చుట్టూ నిర్మాతలు ప్ర‌ద‌క్షిణ‌లు  
* మినిమమ్ గ్యారెంటీ సినిమాల కోసం పాకులాట
* ప్రేక్షకుడి జేబుకి బొక్క పెట్టడమే వారి లక్ష్యం  
( ఏపీ - ఇండియా హెరాల్డ్)
టాలీవుడ్ ప్రొడ్యూసర్లు సినిమాలను ఒక వ్యాపారంగా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. వారు సక్సెస్ ఫుల్ హీరోలు, దర్శకులు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ తమకోసం సినిమాలు చేయాలంటూ అడుగుతున్నారు. ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టేలా సినిమాలు ఉండాలని కూడా కోరుతున్నారు. ప్రేక్షకుల చేత ఎలాగైనా తమ సినిమాలను చూపించాలని ఆరాటపడుతున్నారు. కానీ కంటెంట్ బాగుందా లేదా అనేది చూసుకోవడం లేదు. టికెట్లు రేట్లు ఎక్కువగా పెంచేసి డబ్బులు దండుకోవడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. బండ్ల గణేష్ లాంటి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి మినిమం గ్యారెంటీ హీరోల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.
వాళ్లతోటి సినిమా తీస్తే కచ్చితంగా డబ్బులు మిగులుతాయని భావిస్తున్నారు. అంతేకాకుండా దర్శకులతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే లాగా సినిమాలు తీయాలని అడుగుతున్నారు. ఈ నిర్మాతలు మారేదాకా మన తెలుగు సినిమాల స్థాయి అక్కడే నిలిచిపోతుంది. రాజమౌళి లాంటి దర్శకులను మినహాయిస్తే మిగతా వారందరూ కూడా ఆల్రెడీ చూపించిన కథలనే మళ్లీ కొద్దిగా మార్చేసి ప్రేక్షకులను ఫూల్ చేస్తున్నారు. థియేటర్లకు వెళ్లి చూసేంత దమ్ము సినిమా కథల్లో ఉండడం లేదని అర్థం చేసుకోవచ్చు.
 యాక్షన్, ఎమోషనల్ సీన్లు, ఫైట్లు విజువల్ ఎఫెక్ట్స్, హీరో ఎలివేషన్లు వంటివి ఉండేలా చూసుకుని అదే ఫార్ములాతో సినిమాలు తీసి కోట్లు కొల్లగొడదామని చూస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో వాటిని రిలీజ్ చేస్తూ  ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. వీళ్లు హీరోల చుట్టూ ఇలా ప్రదక్షిణలు చేయకుండా మంచి కంటెంట్ రెడీ చేసుకుని వాటితో సినిమాలు తీస్తే బాగుంటుందని సగటు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా అనేది ఒక కళ. దాన్ని కళ లాగానే గౌరవించడం నిర్మాతలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు హీరోల అభిమానుల జేబులను కాజేయాలనే ఒక ఆలోచనలను తమ మైండ్ నుంచి తీసేయాలి. అప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీ బాగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: