టాలీవుడ్ : క‌థ వ‌దిలేసి కాంబినేష‌న్లు న‌మ్ముకుంటే... ఫ‌స్ట్ వీకెండ్‌కే బొమ్మెత్తేయాలి..!

murali krishna
* భారీ బడ్జెట్ సినిమా అంటూ భారీ బిల్డప్.. తీరా సినిమా చూస్తే..
* రిలీజ్ కు ముందు ఎక్కడ లేని హైప్..
* వారానికే చతికలబడ్డ ఎన్నో స్టార్ హీరోల సినిమాలు..

టాలీవుడ్ లో ఏడాదికి కొన్ని వందల సినిమాలు విడుదల అవుతుంటాయి. అన్ని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం అందుకోవు.. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులకు నచ్చుతాయి.. మీడియం రేంజ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు సినిమాపై భారీగా అంచనాలు ఉంటాయి..ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు రీచ్ కాకపోతే ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా కూడా అట్టర్ ప్లాప్ అవుతుంది.. సినిమాలో దమ్ము ఉండాలి ప్రేక్షకులని థియేటర్ లో కూర్చున్న మూడు గంటలు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి.. అప్పుడే సగటు ప్రేక్షకుడు ఆనందంగా ఇంటికి వెళ్తాడు.. కానీ ఇప్పుడొచ్చే సినిమాలు ఏవి కూడా వాటి అంచనాలు రీచ్ కావడం లేదు.. రిలీజ్ కు ముందు ఓవర్ ప్రమోషన్స్ చేసి ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించగలరేమో కానీ ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ అందులో లేకపోతే మాత్రం నిరాశ చెందుతారు.. దీనితో ఆ సినిమా వారం కూడా థియేటర్ లో సరిగ్గా ఆడని పరిస్థితి ఏర్పడుతుంది..ప్రస్తుతం ఒక స్టార్ డైరెక్టర్ హిట్ అందుకోగానే ఆయనకు వరుస ఆఫర్స్ వస్తుంటాయి..

ఆ డైరెక్టర్ కి కూడా తాను అనుకున్న స్టార్ హీరోతో సినిమా చేసేందుకు అవకాశం వస్తే ఎగిరి గంతేస్తాడు.. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుడి అంచనాలు భారీగా ఉంటాయి.. కానీ ఆ అంచనాలు రీచ్ కాకపోవడానికి బలమైన కారణమే వుంది.. స్టార్ హీరోతో సినిమా చేయడంలో పెట్టిన శ్రద్ధ సగటు దర్శకుడు కథ మీద ఉంచట్లేదు.. దీనితో ప్రేక్షకుడికి కథలో కొత్తదనం లేని ఫీలింగ్ కలుగుతుంది. దీనితో ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా ప్రేక్షకులని మెప్పించలేక వారానికే బిచాన సర్దేస్తుంది..ఇప్పటికైనా దర్శకులు, హీరోలు మారి కాంబినేషన్స్ కోసం సినిమా తీయకుండ మంచి కథతో సినిమా తీస్తే ప్రేక్షకులు ఆ సినిమాలని ఆకాశానికి ఎత్తేస్తారు..సినిమా కొత్తగా ఉంటే ప్రమోషన్స్ కూడా అవసరమే ఉండదు.. కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: