సామాన్యుడుకి దూరమైన సినిమా.. అందుకే తప్పని తెలిసిన పేదోడికి దిక్కైన ఐబొమ్మా?
ఒక రకంగా చెప్పాలంటే సామాన్యుడికి సినిమా భారమైపోయింది. ఇలా భారమై చివరికి దూరమైపోయింది. దీంతో ఇక ఇప్పుడు సామాన్యులు సినిమా చూడాలి అంటే ఐబొమ్మ లాంటి పైరసీ వెబ్సైట్లే దిక్కు అయిపోయాయి పేదోడికి. ఎందుకంటే ఏదో ఒక రోజు హాలిడే వస్తే చాలు సంతోషంగా ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా థియేటర్‌కు వెళ్లి కొత్త సినిమా చూడాలనుకుంటాడు ప్రేక్షకుడు. కానీ నిర్మాతలు ఇక ఇష్టరీతిన పెంచేస్తున్న టిక్కెట్ రేట్లతో సామాన్యుడు థియేటర్ కు వెళ్లాలంటేనే భయపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఒక్కరోజు సినిమా చూసే డబ్బులతో నెల మొత్తం సరుకులు వస్తాయి కదా.. ఎందుకు మన మధ్య తరగతి జీవితానికి ఇంత ఖర్చు అని వెనకడుగు వేస్తున్నాడు.
అయితే ఒకవైపు ఆర్థిక పరిస్థితులు భయపెడుతూ.. టికెట్ రేట్లు బెంబేలెత్తిస్తుంటే.. సినిమా చూడటం కోసం సామాన్యుడు ప్రత్యామ్నయం గురించి చూస్తున్నాడు. అందుకే థియేటర్‌కు వెళ్లి చూడాల్సిన సినిమాను ఐ బొమ్మ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకుని చూసేస్తున్నాడు. ఎందుకంటే కనీసం ఓటీటిలో రిలీజ్ అయిన తర్వాత చూడాలి అన్న అటు ఓటిటి ప్లాట్ ఫామ్స్ కూడా తమ సబ్స్క్రిప్షన్ ధరలను భారీగా పెంచేస్తూ ఉన్నాయి. ఇలా ఒకవైపు థియేటర్ కి వెళ్లాలన్న.. ఇంకోవైపు ఓటీటిలో చూద్దామన్న ఎటు పోయి అటు సామాన్యుడు జోబుకు చిల్లుపడే పరిస్థితి ఉంది.