ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటించిన సినిమాలు విడుదల అయినా కూడా అవి చాలా తక్కువ టికెట్ ధరతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. పెద్దపెద్ద థియేటర్లలో కూడా 50 రూపాయల తోనే అత్యున్నత స్థాయి టికెట్ దొరికేది. దానితో ప్రతి పేదవాడికి సినిమా అనేది అత్యంత తక్కువ ధరతో వీక్షించే ఎంటర్టైన్మెంట్ ఆప్షన్ గా అయ్యింది. దానితోనే చాలా మంది పేదవాళ్లు , మధ్య తరగతి వాళ్లు సినిమా అనేది పేద వాళ్లకు , మధ్య తరగతి వాళ్లకు ఎంటర్టైన్మెంట్ ను కల్పించే గొప్ప సాధనం అనే భావనకు వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు.
ఇకపోతే ప్రస్తుతం మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. ఈ మధ్య కాలంలో ఏవో చిన్న సినిమాలు , పెద్దగా క్రేజీ లేని సినిమాలను మాత్రమే తక్కువ టికెట్ ధరతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అది కూడా ఎక్కువ టికెట్ ధరలు ఉంటే వారు కనీసం థియేటర్ వైపు కూడా చూడరు అనే ఉద్దేశంతోనే అనుకుంటా. ఇక స్టార్ హీరోల సినిమాల గురించి చెప్పనక్కర్లేదు. రెమ్యూనరేషన్లకే వందల కోట్లు ఖర్చు చేసి మేము అద్భుతమైన సినిమా తీశాం. ఇది ఒక విజువల్ వండర్ అని చెప్పేసి టికెట్ ధరలను అమాంతం పెంచేస్తున్నారు.
దానితో ఒక నిరుపేద సినిమా ధియేటర్ వైపు చూడాలి అంటే భయపడే టికెట్ ధరలు స్టార్ హీరోల సినిమాలకు ఉంటున్నాయి. ఒక మంచి థియేటర్లో సినిమా చూడాలి అంటే ఇద్దరు వ్యక్తులకే దాదాపు 1500 రూపాయల వరకు ఖర్చు అయ్యే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఒక పేదవాడు , కూలి పని చేసుకునే వ్యక్తి ఏదైనా ఒక సినిమాను మంచి థియేటర్లలో చూడాలి అనుకుంటే అతడి రెండు , మూడు రోజుల సంపాదన మొత్తం ఖర్చు అయ్యే అవకాశాలు ప్రస్తుతం ఉన్నాయి. ఇలా జరిగితే పేద ప్రజలు సినిమాను ఓ టీ టీ లో , టీవీలో తప్పితే థియేటర్లలో చూస్తాడా..? దానివల్ల సినిమా ఇండస్ట్రీ ఎంత కాలం మంచిగా కొనసాగుతుంది అనే ప్రశ్నలను చాలా మంది లేవనెత్తుతున్నారు.