టాలీవుడ్: వినోదానికి దూరమైన పేదోడు.. అభిమాన హీరో చిత్రం కూడా చూడలేని దుస్థితి.?
- లాభార్జనే ధ్యేయంగా నిర్మాతలు..
- టాలీవుడ్ పై సామాన్య అభిమాని ఆవేదన..
ప్రస్తుత కాలంలో చాలామంది డబ్బు వేటలో పడి కనీసం సంతోషంగా గడిపే సమయాన్ని కూడా ఎప్పుడు కేటాయించుకోవడం లేదు. పొద్దున లేస్తే చాలు కుటుంబం ఎలా గడవాలి పిల్లల స్కూల్ ఫీజులు ఎలా కట్టాలి అనే ఆలోచనలోనే ఏదో ఒక పని మీద బిజీగా ఉంటున్నారు. వచ్చిన డబ్బుతో ఇల్లు కుటుంబాన్ని చూసుకుంటున్నారు. అలా బ్రతుకుతున్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి కాసేపు సినిమా చూసొద్దామని అనుకుంటే సినిమా వాళ్లు కూడా టికెట్ల రేట్లు పెంచి కనీసం వారు థియేటర్లో ఎంజాయ్ చేయలేని పరిస్థితి తీసుకొస్తున్నారు. ఒక ఫ్యామిలీ సినిమాకు వెళ్ళింది అంటే తప్పనిసరిగా 3000 ఖర్చు కావాల్సిందే. అంటే ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నెలరోజుల ఇంటి ఖర్చు ఒకేరోజు కరిగిపోతోంది. దీంతో మధ్యతరగతి పేద ప్రజలు ఎవరైనా సరే సినిమాకు వెళ్లాలంటే జంకుతున్నారు. చివరికి అభిమాన హీరో సినిమా కూడా చూడలేని పరిస్థితికి వస్తున్నారు. మరి ఈ పరిస్థితికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
అభిమాన హీరో సినిమాకు దూరం:
ప్రతి మనిషికి ఎవరో ఒక అభిమాన హీరో ఉంటారు. ఆ హీరో సినిమా వస్తుంది అంటే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసి మరీ ఎంత ఖర్చైనా పెట్టి సినిమాకి వెళ్తారు. అది బ్యాచిలర్ లైఫ్ గా ఉన్నవాళ్లకైతే ఏదైనా సెట్ అవుతుంది కానీ పెళ్లి చేసుకున్న వాళ్లకు పేద మధ్యతరగతి వాళ్లకు ప్రస్తుతం సినిమాకి వెళ్లాలంటే ఖర్చులతో కూడుకున్న పని. చివరికి అభిమాన హీరో సినిమాలు కూడా చూడలేని పరిస్థితికి వచ్చారు.. థియేటర్లలో ఫస్ట్ డే సినిమా టికెట్లు రేట్లు చూస్తే మాత్రం పాన్ ఇండియా చిత్రాలు అయితే 2000 నుంచి 3000 అలా పలుకుతున్నాయి. ఒక్క టికెట్ కు అంత ఉంటే ఇక ఫ్యామిలీతో వెళ్తే వారి కుటుంబ పరిస్థితి ఏం కావాలి. ఇలా లాభార్జనే ధ్యేయంగా సినిమా టికెట్ రేట్లు పెంచుతూ పేద మధ్య తరగతి వాళ్లకు వినోదాన్ని దూరం చేస్తున్నారని, వారి సంతోషాన్ని నిర్మాతలు లాక్కుంటున్నారని సీనియర్ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా సినిమా ఫీల్డ్ ను కాపాడేది సాధారణ ప్రజలే. వారే సినిమా వాళ్లకు అభిమానులు అవుతారు.అభిమాన హీరో సినిమా వస్తే కటౌట్లు ,పాలాభిషేకాలు చేస్తుంటారు. ఒక హీరో కోసం ఖర్చు పెట్టి ఎంతో చేసిన టికెట్ల రేట్లు పెరగడంతో కనీసం వారు కూడా సినిమా చూడలేని పరిస్థితికి వస్తున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.