మహేష్ బాబుకి ఇష్టం లేకుండా నమ్రత చేసిన పని ఇదే.. ముంబై బ్యూటీకి తెలివి ఎక్కువే..!

Thota Jaya Madhuri
మహేష్ బాబు - నమ్రతల జంట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ కపుల్స్ ఉన్నారు. లవ్లీ కపుల్స్ .. అలాగే నాటి రొమాంటిక్ కపుల్స్ కూడా ఉన్నారు. అందరిలోకి ప్రత్యేకం మహేష్ బాబు - నమ్రత . వీళ్ళ పెళ్ళై చాలా కాలమే అవుతుంది . అయినప్పటికీ చాలా చాలా సంతోషంగా.. రొమాంటిక్ గా ..నాటి నాటి పనులు చేస్తూ సరదాగా అసలు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలో అనే విషయానికి ప్రత్యేక నిదర్శనంగా మారారు . కాగా మహేష్ బాబు అంటే నమ్రతకి చాలా చాలా ఇష్టం .


ఎంత ఇష్టమంటే ఆమె ఆయన కోసం తన కెరీర్ ని కూడా వదులుకుంది. స్టార్ హీరోయిన్ స్టేటస్  ఉన్నప్పటికీ ఆమె పెళ్లి తర్వాత సినిమాలు చేయకుండా సైలెంట్ గా ఉండిపోయింది . కేవలం కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ వచ్చింది. అయితే నమ్రత ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్ హీరోయిన్గా మారి తనకంటూ స్పెషల్ స్థానాన్ని క్రియేట్ చేసుకోవాలనుకుందట . కానీ మహేష్ బాబు పై ఉన్న ఇష్టంతో ఘట్టమనేని ఫ్యామిలీ కోడలు గానే మిగిలిపోయింది .


తాను చేయలేని పని తన కూతురు దగ్గర చేయించడానికి ఆమె కూతురు సితారని ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా దింపడానికి నిర్ణయించుకుందట.  నిజానికి మహేష్ బాబు కి సితార హీరోయిన్ అవ్వడం ఇష్టం లేదు . కానీ నమ్రతనే ముందుగా మహేష్ బాబు ని ఈ విషయంలో ఒప్పించిందట . అయినప్పటికీ ఆయన చాలా చాలా గట్టిగా వద్దు అంటూనే ట్రై చేశారట.  ఆఖరికి సితార కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావడానికి ఓకే చెప్పడంతో మహేష్ బాబుకి ఇష్టం లేకపోయినా నమ్రత ఆనందం కోసం మహేష్ ..సీతారను హీరోయిన్ గా దింపడానికి ఒప్పుకున్నాడట . నమ్రత చాలా చాలా తెలివైనది అని చెప్పడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: