' విశ్వంభర ' టీజర్... హాలీవుడ్ సినిమాలకు కాపీ.. సాక్ష్యాలతో దొరికేశారుగా...!
దసరా కానుకగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భారీ సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర టీజర్ విడుదల చేశారు. టీజర్‌లో చిరు లుక్… మెగా ఫ్యాన్స్ కు అయితే బాగానే నచ్చింది. అది అక్కడ వరకే.. టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ పై ఇప్పుడు సోషల్ మీడియా వేదిక గా విపరీతమైన చర్చ నడుస్తోంది. వీఎఫ్ఎక్స్ చాలా దారుణంగా ఉన్నాయన్న విమర్శలు మొదలై పోయాయి. ఇవి చీప్‌గా ఉన్నాయని.. చాప చుట్టేసిన ఫీలింగ్ కలుగుతోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీని తట్టుకోవాలంటే ఈ ఎఫెక్ట్ సరిపోదని ఇండస్ట్రీలో మెజారిటీ వర్గం అభిప్రాయపడుతోంది. లాప్‌టాప్‌లలో, సెల్ ఫోన్లలో చూస్తే ఓకే గానీ, పెద్ద తెరపై టీజర్ చూస్తే చాలా చీఫ్‌గా ఉందనే అంటున్నారు. కొందరైతే హాలీవుడ్ సినిమాల విజువల్స్ కాపీ కొట్టారంటూ, సాక్ష్యాలతో సహా చూపిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా కోసం ... వీఎఫ్ఎక్స్ పై సినిమా యూనిట్ ఎక్కువ సమయమే కేటాయించడంతో పాటు భారీగా ఖర్చు పెట్టింది. అయినా టీజర్ చూశాక ఏ మాత్రం ఫలితం కనిపించలేదు.
అయితే ఇప్పుడు వాళ్ల ముందు కావాల్సినంత టైం ఉంది.. సంక్రాంతికి రావాల్సిన సినిమా మే నెలకు వాయిదా పడిపోయింది. ఇంకా చాలా టైం ఉంది. ఈ టైంలో వీఎఫ్ ఎక్స్ వర్క్ సరి చేసుకోవచ్చు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ విషయంలో ఇదే జరిగింది. టీజర్ చూసి అంతా మొహాలు తేలేసి షాక్ అయిపోయారు. టీజర్‌కి వచ్చిన స్పందన చూసిన తర్వాత యూనిట్ వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకొంది. వీఎఫ్ఎక్స్ లో కొన్ని షాట్స్ మార్చింది. ఇప్పుడు విశ్వంభర విషయంలో నిర్మాతలు సీరియస్ గా దృష్టి పెడితే మంచిది. లేకపోతే చిరు పరువు ఈ భారీ సోషియో ఫాంటసీ సినిమా సాక్షిగా పోవడం ఖాయం.