టాలీవుడ్ : క‌థ‌.. కాక‌ర‌కాయ్ మాకెందుకు... మా డ‌బ్బు మాకిస్తే... కాల్షీట్లు ఇస్తాం..?

Amruth kumar
( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
సాధారణంగా ఏ సినిమా అయినా సూపర్ డూపర్ హిట్ అవ్వాలంటే కాంబినేషన్లో ముఖ్యం కాదు టాలీవుడ్ లో ఇప్పుడు అందరూ కాంబినేషన్లో నమ్ముకుంటున్నారు . కథ‌ ఏంటి అన్నది ఎవరూ పట్టించుకోవడం లేదు .. ఒక స్టార్ హీరో ఉన్నాడా స్టార్ డైరెక్టర్ ఉన్నాడా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ను పెట్టామా బాలీవుడ్ నుంచి పెద్ద పేరన్న సినిమా ఆటోగ్రాఫర్ ను తీసుకు వచ్చామా ఇవే చూసుకుంటున్నారే తప్ప అంతిమంగా ప్రేక్ష‌కుడిని కూడా మెప్పించేది కథ‌ బలమైన కథనం 2 గంటల పాటు దియేటర్లలో వారిని కూర్చోబెట్టి వాళ్ళకి మంచి ఆనందం ఇవ్వటం అన్నది పూర్తిగా మర్చి పోతున్నారు . . అసలు టాలీవుడ్ లో స్టార్ హీరో లు సైతం కమర్షియల్ మాయలో పడిపోయి .. కథ ఏమిటి కథనం ఎలా ఉంటుంది అన్నది అస్సలు పట్టించుకోవడం లేదు.

మా డబ్బు మాకు ఇస్తే మీకు కావాల్సిన కాల్ షీట్లు మీకు పడేస్తాం మాకు ఎన్ని కోట్లు డబ్బులు ఇస్తారు మీకు ఎన్ని రోజులు కాల్ షీట్లు కావాలి ఇవే లెక్కలు వేసుకుంటున్నారు .. దీంతో దమ్మున్న కథనాల తో టాలీవుడ్ లో సినిమాలు అస్సలు తెరకే కట్టడం లేదు ..ఇక ఇదే క్రమంలో టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలో కథల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.. దర్శకులు హీరోలకు రొటీన్ రొట్టె కథ‌లని వినిపిస్తూ వాటిని తిప్పి తిప్పి తీస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హీరోలు కూడా వాటినే ఫాలో అవుతూ కథ‌ కాకరకాయ మాకెందుకు.. ఫస్ట్ డే కలెక్షన్ బాగా వస్తే చాలు.. సినిమా అడగకపోయినా పర్లేదు మా డ‌బ్బులు మాకు వస్తేతే చాలు అనే చందాన ఏది పడితే దానికి ఓకే చెబుతూ సినిమాల మీద ఫ్యాషన్ను నిర్మాతలకు, ప్రేక్షకులకు తలనొప్పిగా తయారయ్యారు.

గతంలో మన పాత తరం హీరోలు ముందు సినిమా కథను బట్టి సినిమాలో నటించేవారు. లేక దర్శకుడుకు మాటిస్తే క‌థ‌ నచ్చకపోతే ప్రొడ్యూసర్లకు రెమ్యున‌రేష‌న్ లేకుండా సినిమా తీసేవారు. నిర్మాతలను నష్టపోకుండా మన పాత తరం హీరోలు చూసుకునేవారు. అలాగే ప్రేక్షకులు కావాల్సిన కథలను సినిమాలు చేస్తూ వచ్చేవారు. ఇప్పుడు తరం హీరోలు మాత్రం మోస పద్ధతిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తూ సినిమాలంటేనే బ్యాన్ చేసే విధంగా చేస్తున్నారు. ఇదేవిధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో టాలీవుడ్ పరిస్థితి చాలా దారుణంగా మారుతుందని చెప్పడం ఎలాంటి సందేహం లేదు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: