"నా కొడుకు ఆ పని చేస్తే చూడాలని ఉంది".. మనసులోని కోరికను బయటపెట్టిన చిరంజీవి..!

Thota Jaya Madhuri
మెగాస్టార్ చిరంజీవి ఏ విషయాని అయినా ఓపెన్ గా చెప్పేస్తాడు అన్న విషయం అందరికీ తెలిసిందే.  ఇప్పటికే అలా జరిగిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి.  పద్ధతికి మరో మారుపేరు మెగాస్టార్ చిరంజీవి అన్న బిరుదు కూడా ఉంది . బిడ్డలను కూడా అలాగే పెంచాడు . కానీ కొన్ని కొన్ని విషయాలలో శ్రీజ తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా చిరంజీవి ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. కాగా చిరంజీవి అనగానే ఇప్పుడు అందరికీ గుర్తొచ్చేది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .


చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ అనే రేంజ్ కి ఎదిగిపోయాడు . ఒక్కొక్క మెట్టుని పైకి  ఎక్కుతూ తన లైఫ్ ని ఫుల్ సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నాడు . కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలను చాలామంది రీమేక్ చేయాలని ఆ సినిమాలకు సీక్వెల్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.  అయితే ఇదే మూమెంట్లో ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవికి ఎదురైన ప్రశ్నకు ఆయన ఇచ్చిన ఆన్సర్ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తుంది.


"మీరు నటించిన సినిమాలలో మీ అబ్బాయి రామ్ చరణ్ ఏ సినిమాని రీమేక్ చేయాలి అని అనుకుంటున్నారు..?" అని ప్రశ్నించగా.. చిరంజీవి ఎక్సెలెంట్ ఆన్సర్ ఇచ్చారు. ఆయన నటించిన "స్వయంకృషి" సినిమా అంటే చిరంజీవికి చాలా చాలా ఇష్టమట.  ఆ సినిమా ని రీమేక్ చేస్తే చాలా బాగుంటుంది అని .. ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పుకు వచ్చారు . మెగా ఫ్యాన్స్ కూడా ఇదే విషయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. స్వయంకృషి సినిమా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు ఈ జనరేషన్ కి తగ్గట్టు తెరకెక్కిస్తే అందులో రామ్ చరణ్ నటిస్తే సినిమాకి కేక.. అదిరిపోతుంది.. మరో ఆస్కార్ పక్క అంటున్నారు. చూద్దాం మరి ఆ సాహసం ఏ డైరెక్టర్ చేస్తాడో..??

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: