యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే అనిరుధ్ పేరు మారు మ్రోగుతుంది.తన అద్భుతమైన టాలెంట్ తో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ పేరు సాధించుకున్నాడు.ధనుష్ నటించిన త్రి సినిమాతో ఫిలిం ఇండస్ట్రీకి సంగీత దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్ ఆ సినిమాలో ‘వై థిస్ కొలవరి’ సాంగ్ తో ఒక పాటతో సంచలనం సృష్టించాడు... కేవలం ఆ పాట కోసమే థియేటర్ కు వెళ్లిన ఆడియన్స్ కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు..కానీ ఆ సినిమా మాత్రం ఊహించిన ఫలితం అందుకుంది.స కానీ సంగీత దర్శకుడుగా అనిరుద్ కి వరుస అవకాశాలు తెచ్చి పెట్టింది. దాదాపు స్టార్ హీరోల సినిమాలందరితో పనిచేసిన ఘనత అనిరుద్ కే దక్కింది. ప్రస్తుతం అనిరుధ్ మ్యూజిక్ కి ఒక బ్రాండ్ లా మారింది.. అనిరుధ్ తెలుగులో అజ్ఞాతవాసి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా చవిచూసింది. కానీ ఈ సినిమాకు మాత్రం మంచి మ్యూజిక్ నిలిచింది. కానీ అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటికీ హైలైట్ అని చెప్పొచ్చు.
అనిరుధ్ ఆ సినిమా తర్వాత జెర్సీ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇక రీసెంట్ గా అనిరుద్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ దేవర సినిమాకు మ్యూజిక్ అందించగా ఆ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.. అంతేకాదు ఈ సినిమాకు అనిరుధ్ ఇచ్చిన బిజీఏం ఎంతగానో ఆకట్టుకుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే కొరటాల శివ చేసిన నాలుగు సినిమాలకు దేవిశ్రీప్రసాద్సంగీతం అందించాడు. అలానే వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా అందుకున్నాడు దర్శకుడు కొరటాల. ఇక ఆచార్య సినిమాకి మొదటిసారి మణిశర్మ తో పనిచేశాడు. అలానే దేవరా సినిమాకి మొదటిసారి అనిరుద్ తో పనిచేశాడు.అనిరుధ్ మ్యూజిక్ కి ఫిదా అయిన తెలుగు ఆడియన్స్ తెలుగులో స్టార్ హీరోల సినిమాలకి సంగీత దర్శకుడుగా అనిరుధ్ ను తీసుకోవాలని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు.. ఈ విషయంపై సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్పందించారు. అలా జరగడం అనేది ఎంతో మంచి పరిణామం. అనిరుధ్ ఇక్కడ తెలుగు సినిమాలు చేసినట్లు, నేను కూడా తమిళ్లో చాలా సినిమాలు చేశాను. అలానే హిందీ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలు చేశాను. మనం అలా ఫీల్ అవ్వకూడదు సంగీతానికి భాషతో సంబంధం లేదు అంటూ దేవిశ్రీప్రసాద్ చెప్పుకొచ్చారు. దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, పుష్ప టు సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు.