ఏజ్ లో ఉన్నావ్..అలాంటి పాత్రేందుకు అంటూ కన్నీళ్లు పెట్టించారంటున్న సీనియర్ నటి.!

FARMANULLA SHAIK
ఫిల్మ్ ఇండస్ట్రీలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గురించి దాదాపు తెలియని వారుండరేమో. సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం పలు సినిమాల్లో బామ్మ క్యారెక్టర్ లో అలరిస్తున్నది. అన్నపూర్ణమ్మ అంటే ఇండస్ట్రీలో నాటి తరం నుంచి నేటి తరం నటీనటులకు ఎనలేని గౌరవం. ఇదిలావుండగా అన్నపూర్ణమ్మని రామానాయుడు అవమానించిన విషయం, అలాగే శోభన్‌ బాబు తనని సెట్‌లో రమ్మని పిలిచిన విషయం గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేసింది. సోగ్గాడి మాట తన లైఫ్‌నే మార్చేసిందని తెలిపింది. అన్నపూర్ణమ్మ లైఫ్‌ టర్న్ అవ్వడానికి, నటిగా సినిమా రంగంలో నిలబడటానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా శోభన్‌బాబు కారణం అని తెలిపింది. ఆయన చెప్పిన ఓ మాట తాను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని, అదే ఆమె లైఫ్‌ని మలుపు తిప్పిందని చెప్పింది. మరి ఇంతకి ఏం జరిగిందంటే, తనకు జరిగిన అవమానాలను బయటపెట్టింది అన్నపూర్ణమ్మ.రామానాయుడు చేసిన అవమానం వెల్లడించింది. రామానాయుడు ఆ టైమ్‌లో ముందడుగు సినిమా చేస్తున్నారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ, సోగ్గాడు శోభన్‌బాబు హీరోలుగా నటించారు. అప్పట్లో ఇది పెద్ద మల్టీస్టారర్‌ మూవీ. ఇందులో తల్లి పాత్ర కోసం ఎవరిని అనేది పెద్ద చర్చ జరిగింది.చాలా మంది మదర్ క్యారెక్టర్‌ చేసే ఆర్టిస్ట్ లను చూశారు. అందులో అన్నపూర్ణమ్మని సజెస్ట్ చేశారు. అయితే ఈమె యంగ్‌గా ఉండేదట. పెద్ద స్టార్‌ హీరోలకు అమ్మ అంటే సెట్‌ కాదేమో అని రామానాయుడు నో అన్నాడట. కానీ బలవంతంగానే ఓకే చేశాడట. అయినా షూటింగ్‌లో ఎప్పుడూ తన వైపే చూస్తుండేవాడట.అది తమకు చాలా ఇబ్బందిగా అనిపించేదని చెప్పింది అన్నపూర్ణమ్మ. మొత్తానికి షూటింగ్‌ అయిపోయిందని, కానీ డబ్బింగ్‌ చెప్పించలేదని తెలిపింది. అదేంటని అడిగితే నీ వాయిస్‌ బాగా లేదు అని చెప్పారట. దీంతో తాను కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలిపారు. అయితే ఆ సౌండ్‌ ఇంజనీర్‌ చూసి డబ్బింగ్‌ ప్రాక్టీస్‌ చేయించి చెప్పితే, వాయిస్‌ బాగుందని ఓకే చేశారట.అయితే ఈ సినిమా షూటింగ్‌ టైమ్‌లో ఓ వైపు తాను, తన అమ్మ కూర్చునే వాళ్లట. వాళ్లని గమనించిన శోభన్‌బాబు ఇటు రమ్మని సైగలు చేసేవాడట. చాలా సేపు ఆయన సైగలు చేయడంతో మొదట్లో ఇబ్బంది పడ్డారు. అంత పెద్ద హీరో అలా సైగలు చేస్తున్నాడేంటి? అని ఏవేవో అనుకున్నారట. ఆ తర్వాత తనే దగ్గరికి వెళ్లింది. ఆయన ఏ ఊరు అని అడిగితే బెజవాడ అని, వేషాలు వేయడానికి వచ్చామని చెప్పారట.అయితే ఇక్కడ వేషాలు వేయాలంటే అలా ఓ మూలకు కూర్చోవద్దు, అలా కూర్చుంటే ఎవరూ పట్టించుకోరు, ఎప్పుడూ అక్కడే ఉండిపోతారు, కాస్త పది మంది ఉన్న చోట, ఎక్కువగా మాట్లాడుకునే చోట ఉండాలని, వాళ్ల మధ్యలో ఉండాలని, మాటలో మాట కలుపుతుండాలని తెలిపారట శోభన్‌బాబు.జనంలో, సినిమా యూనిట్ల మధ్యలో కనిపిస్తే గుర్తిస్తారని, మీరు ఆర్టిస్టులనేది వాళ్లకి ఓ ఐడియా ఉంటుందని, అప్పుడే వేషాలు వస్తాయని తెలిపారట. అలాగే అని అక్కడి నుంచి వెళ్లిపోయారట. అయితే ఆ రోజు ఆయన చెప్పిన మాట తన జీవితంలో ఎంతో ఉపయోగపడిందని, అదొక జీవిత పాఠంలా మారిందని, ఆ రోజు ఆయన ఆ మాట చెప్పి ఉండకపోతే తాను ఎలా ఉండేదాన్నో అని వెల్లడించింది అన్నపూర్ణమ్మ.ఇక అన్నపూర్ణ తన 18 ఏళ్ల కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయాన్ని తలచుకుని భావోద్వేగానికి గురికావడం ఈ ఇంటర్వ్యూ చూసినవారికి కంట నీరు తెప్పించింది.ఇక ప్రస్తుతం అన్నపూర్ణమ్మ ఈటీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ లో కనిపిస్తూ అందరిని అలరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: