నాగబాబు చెంప పగల కొట్టిన చిరంజీవి .. తమ్ముడు మీద అంత కోపం ఎందుకు వచ్చింది అంటే..?

Amruth kumar
టాలీవుడ్ లో ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన‌ చిరంజీవి తిరుగులేని స్టార్ హీరోగా ఎదిగాడు. అలా మెగా  ఫ్యామిలీ అనే ఒక సామ్రాజ్యాన్ని  నెలకొల్పాడు. చిరంజీవి తర్వాత నట వారసులుగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ టాలీవుడ్ లోనే అగ్ర నటులుగా మారారు. వరుణ్ తేజ్ , సాయి ధరంతేజ్ కూడా మినిమం హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. ఇక మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎంతో అన్యోన్యంగా ఉంటారు.. తమ అభివృద్ధికి కారణమైన అన్నయ్య చిరంజీవిని నాగబాబు , పవన్ కళ్యాణ్ ఎంతో గౌరవిస్తూ ప్రేమిస్తారు.

అయితే ఒక సందర్భంలో నాగబాబును చిరంజీవి పిచ్చకొట్టడు కొట్టాడట.. ఇదే విషయాన్ని చిరంజీవి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఇది వారి చిన్నతనంలో జరిగిన సంఘటనట‌. చిరంజీవి వీరులో పెద్దవాడు కావడంతో అమ్మానాన్నలకు చేదోడు వాదోడుగా ఉండేవాడు.. అటు చదువుకుంటూనే ఇంట్లో అన్ని పనులు చక్కదిద్దే వాడట. ఒకరోజు చిరంజీవి మరో పని మీద బయటకు వెళుతూ.. నాగబాబుకు ఒక పని చెప్పాడట.. లాండ్రి షాప్ కు వెళ్లి బట్టలు తీసుకురా అని అన్నాడట.. నాగబాబు సరే అన్నయ్య అని అక్కడ నుండి వెళ్లిపోయాడట. చిరంజీవి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత లాండ్రీ నుండి బట్టలు తెచ్చావా? అని నాగబాబుని అడగగా , ఆయన తేలేదని సమాధానం చెప్పాడట. దాంతో కోపంతో చిరంజీవి చెప్పిన ఎందుకు చేయలేదని నాగబాబుని కొట్టాడట.

ఇక తర్వాత నాగబాబు వెళ్లి అమ్మ అంజానా దేవికి కంప్లీట్ చేయకగా అంజనదేవి చిరంజీవిపై కోప్పడిందట. సాయంత్రం ఇంటికి వచ్చిన తండ్రి వెంకట్ రావు నాగబాబునే తిట్టాడటన‌న‌ అసలు మేటర్ ఇదిన్న మాట‌. ఇలా తమ్ముళ్ల విషయంలో చిరంజీవి చిన్న త‌న్నం నుంచే ఎంతో శ్రద్ధగా ఉండేవాడు. వాళ్లను కంటికి రెప్పలా చూసుకుంటూ ఏది కావాలంటే అది ఇచ్చేవాడు. అలా నాగబాబు ఆరెంజ్ సినిమా తీసి పెద్ద మొత్తంలో నష్టపోయి తన ఆస్తులు మొత్తం అమ్మిన అప్పులు తీర్చే పరిస్థితి లేదు ఎంతో డిప్రెషన్ లోకి వెళ్లిన నాగా బాబును తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆదుకున్నారు. ఈ విషయాన్ని నాగబాబు కూడా స్వయంగా ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ మెగా బ్రదర్ టాలీవుడ్ లోనే స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. అలాగే జనసేన పార్టీ కీలక నాయకుడిగా ఉంటూ రాజకీయాల్లో కూడా కీలకపాత్ర పోషిస్తున్నాడుు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: